రాష్ట్రీయం

శ్రీశైలం నుంచి కొనసాగుతున్న నీటి విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం టౌన్ : శ్రీశైలం డ్యాం నుండి నాగార్జున సాగర్‌కు నీటి విడుదల కొనసాగుతోంది. కృష్ణానది పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలానికి వచ్చే వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో డ్యాం పది గేట్లను 30 అడుగుల మేరకు ఎత్తి నీటి విడుదల కొనసాగిస్తున్నారు. శనివారం సాయంత్రం 6 గంటల సమయానికి జూరాల, తుంగభద్ర నదుల ద్వారా 5,80,333 క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చి చేరింది. దీంతో డ్యాం నీటి మట్టం 881.30 అడుగులుగా ఉండగా, నీటి నిల్వ సామర్థ్యం 195.2102 టీఎంసీలుగా నమోదైంది. జలాశయం బ్యాక్ వాటర్ ద్వారా కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2400 క్యూసెక్కులు, హంద్రీనీవాకు 2025 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు 40 వేల క్యూసెక్కులు, రెండు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పాదన ద్వారా 69,651 క్యూసెక్కుల నీటిని మళ్లిస్తున్నారు. డ్యాం పది గేట్లతోపాటు మొత్తం శ్రీశైలం జలాశయం నుండి 7,47,546 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.
తెలంగాణ ఆక్టోపస్ దళాల మాక్‌డ్రిల్
శ్రీశైలం డ్యాం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆక్టోపస్ దళం పోలీసులు శనివారం మాక్‌డ్రిల్ నిర్వహించారు. కాశ్మీర్‌పై కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఉగ్రదాడులు దేశంలో జరుగుతాయనే ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో మాక్‌డ్రిల్ నిర్వహించినట్లు సమాచారం. ఆక్టోపస్ అడిషనల్ డీజీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు ఎస్పీ సిద్దిఖీ ఆధ్వర్యంలో ఆక్టోపస్ యూనిట్ మాక్‌డ్రిల్ చేపట్టారు. అనుకోని ఏదైన ప్రమాదం సంభవించినప్పుడు ప్రజలను రక్షించి, శత్రువులను ఎలా మట్టుపెట్టాలనే దానిపై మాక్‌డ్రిల్ చేశారు. ఉదయం అక్టోపస్ పోలీసులు డ్యాం పరిసరాలను మొత్తం రెక్కీ నిర్వహించారు. 360 డిగ్రీల ఆరు కెమెరాలు కలిగిన అధునాతన కెమెరాతో జలాశయం పరిసరాలను చిత్రీకరించారు. ఒక సెకన్‌లోనే ఆరు కెమెరాలు పనిచేసి ఫొటో తీసి ఆటోమెటిక్‌గా వీడియో రికార్డింగ్ కూడా చేస్తుంది. ఆక్టోపస్ దళం మాక్‌డ్రిల్ నిర్వహించేంత వరకు శ్రీశైలం ఆనకట్టపైకి పర్యాటకులు ఎవరినీ అనుమతించలేదు.
చిత్రాలు.. శ్రీశైలం జలాశయం పది గేట్ల ద్వారా దిగువకు విడుదల అవుతున్న నీరు..
*ఆనకట్ట వద్ద తెలంగాణ ఆక్టోపస్ దళాలు