తెలంగాణ

పులిచింతలకు తగ్గని నీటి ఉధృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేళ్లచెర్వు, ఆగస్టు 17: ఎగువ నుండి వస్తున్న భారీ వరద నీరు పులిచింతల ప్రాజెక్టుకు చేరడంతో జలకళతో పర్యాటకులకు కనువిందు చేస్తుంది. శనివారం సాయంత్రం నాటికి 45.77 టీఎంసీల పూర్తి నీటి సామర్ధ్యానికి గాను 36.57 టీఎంసీల నీటిని నిల్వచేసినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. 175 అడుగుల పూర్తి నీటి సామర్థ్యానికి గాను 168.75 అడుగుల మేర నీటిని నిల్వ చేశామని, ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లోగా 6.39 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా, ఔట్‌ఫ్లోగా 6.54 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ భాగాన ఉన్న ప్రకాశం బ్యారేజికి 22 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. నీటి నిల్వను ఇదేవిధంగా కొనసాగిస్తూ వచ్చే నీటి ప్రవాహాన్ని అదే రీతిలో దిగువ భాగానికి విడుదల చేస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా ప్రాజెక్టుకు పోలీసు, రెవెన్యూ యంత్రాంగం సందర్శనలతోపాటుగా పర్యాటకుల తాకిడి కూడా పెరిగింది. అటు అంధ్రప్రదేశ్ రెవెన్యూ, పోలీసు అధికారులు కూడా ప్రాజెక్టు వరద నీటిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.