రాష్ట్రీయం

లక్ష్మీ బ్యారేజీ 33 గేట్లు ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహదేవ్‌పూర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన లక్ష్మీ బ్యారేజీ (మేడిగడ్డ) శనివారం అధికారులు 33 గేట్లు ఎత్తివేశారు. దీంతో 2లక్షల 87వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
ప్రస్తుతం బ్యారేజీ 93.70 మీటర్ల లెవల్‌లో ఉండగా 3.03 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. సరస్వతీ బ్యారేజీ (అన్నారం) గేట్లు మూసివేయడంతో ఇన్‌ఫ్లో 11వేల క్యూసెక్కుల నీరు చేరుకుందని, అలాగే 10.87 టీఎంసీలకు గాను 7.20 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం 117.300 మీటర్ల లెవల్‌లో ఉండగా లక్ష్మీ పంపుహౌస్‌తో పాటు సరస్వతీ పంపుహౌస్‌లను అధికారులు మూసివేశారు.

చిత్రం...గేట్లు ఎత్తివేయడంతో దిగువకు వెళ్తున్న నీరు