రాష్ట్రీయం

కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 18: కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు బీజేపీకి లేదని సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ టీఆర్‌ఎస్‌కు తోక పార్టీ అంటూ బీజేపీ చేసిన వ్యాఖ్యలను ప్రజలు ఏవగించుకుంటున్నారన్నారు. వాస్తవానికి రాష్ట్రంలో టీఆర్‌ఎస్, బీజేపీలు లోపాయికారి ఒప్పందంతో పనిచేస్తున్నాయన్నారు. ఆదివారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీకి అవసరమైన మద్దతును సంక్లిష్టసమయంలో టీఆర్‌ఎస్ ఇస్తోందన్నారు. రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఒక పెద్ద స్కాం అనే విషయాన్ని తామే ముందు నుంచి చెబుతున్నామన్నారు. ఎల్లంపల్లికి పంప్ చేసిన నీటి కంటే ఎక్కువ జలాలను దిగువకు వదిలేశారన్నారు. దీని వల్ల ఖజానాకు లాభమా, నష్టమా అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి గురించి తాము ముందు నుంచి చెబుతున్నామన్నారు. సీతారామ, పాలమూరు స్కీంలలో కూడా కోట్లాది రూపాయల అవినీతి చోటు చేసుకుందన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం వీటి మీద విచారణ జరిపించేందుకు కేంద్రంపై వత్తిడి తేవాలన్నారు. ప్రతి టెండర్‌లో ఒకే సంస్థకు పనులు దొరికాయన్నారు. ప్రజల్లో ఆదరణ లేని నేతలను బీజేపీ చేర్చుకుంటోందన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమంటూ బీజేపీ చెప్పుకుంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు.