రాష్ట్రీయం

శ్రీశైలానికి వరద తగ్గుముఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం టౌన్, ఆగస్టు 18: కృష్ణానది పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి జూరాల, తుంగభద్ర నదుల ద్వారా 3,93,197 క్యూసెక్కుల వరద నీరు వచ్చి జలాశయంలోకి చేరుతోంది. దీంతో డ్యాంలో నీటి నిల్వ 200.1971 టీఎంసీలుగా, నీటి మట్టం 882.2 అడుగులుగా నమోదైంది. ఇక జలాశయం బ్యాక్ వాటర్ ద్వారా, 10 గేట్ల ద్వారా 4,73,187 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. డ్యాం గేట్ల ఎత్తును కూడా జలాశయం అధికారులు తగ్గించారు. ఆదివారం సెలవు దినం కావడంతో పర్యాటకులు అధిక సంఖ్యలో డ్యాం వద్దకు చేరుకోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సందర్శకుల తాకిడితో జలాశయం పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది.