రాష్ట్రీయం

శ్రీవారిని దర్శించుకున్న నిర్మలా సీతారామన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 18 : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్‌లో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రికి టీటీడీ తిరుమల ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని ప్రత్యేకాధికారి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్‌వో గోపీనాథ్‌జెట్టి, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, పేష్కార్ లోకనాథం పాల్గొన్నారు.

చిత్రం...తిరుమలలో ఆదివారం స్వామివారిని దర్శించుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్