రాష్ట్రీయం

వైభవంగా మహారథోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రాలయం : మంత్రాలయంలో ఆదివారం శ్రీరాఘవేంద్రస్వామి మహారథోత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీరాఘవేంద్రస్వామి 348వ సప్త ఆరాధన మహోత్సవాల సందర్భంగా 5వ రోజైన ఆదివారం ఉత్తరారాధన వేడుకలు పురస్కరించుకుని తొలుత స్వామి మూల బృందావనానికి విశేష అభిషేకాలు నిర్వహించారు. అలాగే శ్రీప్రహ్లాదరాయలు ఉత్సవమూర్తిని వజ్రవైడూర్యాలతో పొదిగిన ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించి పల్లకిలో కొలువుదీర్చి శ్రీమఠం నుంచి వేద పాఠశాల వరకూ మళ్లీ అక్కడి నుంచి శ్రీమఠం వరకూ ఊరేగించారు. అనంతరం పీఠాధిపతి శ్రీసుభుదేంద్రతీర్థులు ప్రత్యేక పూజలు చేశారు. ఇక మహారథోత్సవం సందర్భంగా శ్రీమఠంలో వసంతోత్సవం పురస్కరించకుని రంగులు జల్లుకుని, శ్రీప్రహ్లాదరాయలును మహారథంలో కొలువుదీర్చి ప్రత్యేక హారతి ఇచ్చారు.
అనంతరం శ్రీమఠం దగ్గర నుంచి రాఘవేంద్ర కూడలి వరకూ అశేష భక్తజనం హర్షధ్వనులు, పండితుల వేదమంత్రాలు, భక్తుల కోలాటాలు, నృత్యాలు, విన్యాసాలు, సన్నాయి మేళతాళాల మధ్య పురవీధుల్లో ఊరేగించారు. మహారథోత్సవం తిలకించేందుకు వచ్చిన భక్తులతో మంత్రాలయం జనసంద్రంగా మారింది.
చిత్రం...మంత్రాలయం పురవీధుల్లో వైభవంగా సాగిన మహారథోత్సవం