రాష్ట్రీయం

ముదురుతున్న డ్రోన్ వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 19: రాష్ట్ర ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడి నివాసగృహంపై ప్రభుత్వం ప్రయోగించిన డ్రోన్ ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, శాసనసభలో ఉప నేతలు కే అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎంపీలు కేశినేని శ్రీనివాస్, గల్లా జయదేవ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు సహా మొత్తం 15 మందితో కూడిన టీడీపీ ప్రతినిధి బృందం సోమవారం రాజ్‌భవన్‌కు వెళ్లి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కల్సి ఈ విషయమై లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు భద్రతపై వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండే బాబు నివాస గృహాన్ని డ్రోన్ కెమెరాలతో ఎలా ఫొటోలు తీస్తారంటూ మండిపడ్డారు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటిని డ్రోన్ కెమెరాలతో ఫొటోలు తీసే ముందు అనుమతి తీసుకోరా అంటూ ప్రశ్నించారు. ఈ విషయమై ఇప్పటికే గుంటూరు రేంజి ఐజీకి ఫిర్యాదు చేశామన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌కి నాలుగు పేజీల లేఖను అందజేశారు. బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో బాబు భద్రతను కుదించిన ప్రభుత్వం హైకోర్టు ఆదేశాల తర్వాత తిరిగి భద్రతను పెంచడాన్ని ఈ సందర్భంగా గవర్నర్‌కు గుర్తు చేశారు. డ్రోన్ ఎగుర వేస్తూ పట్టుబడిన వ్యక్తి జగన్ నివాసంలో ఉండే ముఖ్యమంత్రి కిరణ్ ఆదేశాల మేరకే చిత్రీకరించానని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై న్యాయస్థానంలో ఓ ప్రైవేట్ కేసు దాఖలు చేయాలని టీడీపీ నిర్ణయించింది. ఈ కేసులో ముఖ్యమంత్రి జగన్ పేరును కూడా చేరుస్తామని అచ్చెన్నాయుడు మీడియాతో చెప్పారు. కిరణ్ వాంగ్మూలం ఆధారంగానే కేసు దాఖలు చేస్తున్నామని తెలిపారు. అసలు రాష్ట్రంలో ఈ వరద బీభత్సానికి ప్రభుత్వమే కారణమని, సహాయక చర్యల్లోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని అన్నారు. వరద ప్రవాహాల నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఏదో విధంగా చంద్రబాబును ఇబ్బందుల్లో పెట్టాలని చూస్తున్నారన్నారు. వరదల వల్ల పంటలు సర్వనాశమయ్యాయని, అలాగే సహాయక చర్యల్లో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందినదన్నారు. వరదలు వస్తుంటే జగన్ విహారయాత్రలకు వెళ్లారని, ఇక కనీస అవగాహ లేకుండా జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ మాట్లాడుతున్నారంటూ అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శించారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజీ సామర్థ్యం కేవలం మూడు టీఎంసీలు కాగా నాలుగు టీఎంసీలు వచ్చే వరకు ఎందుకు ఆపారని ప్రశ్నించారు. వరద ఉద్ధృతి పెరగ్గానే కిందకు నీటిని ఎందుకు వదలలేదని ప్రశ్నించారు. ఒక్కసారిగా వరద కిందకు వదిలితే ఇబ్బందులు వస్తాయని తెలియదా అని ప్రశ్నించారు. వృథాగా పోయే నీటిని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదన్నారు.
చిత్రం...ద్రోన్ వివాదంపై సోమవారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి ఫిర్యాదు చేస్తున్న టీడీపీ నేతలు