రాష్ట్రీయం

కుట్ర కోణం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు : చంద్రబాబు నివాసంపై డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించిన ఘటనలో ఎటువంటి కుట్రకోణం లేదని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టంచేశారు. కృష్ణానదిలో వరద ఉధృతి అంచనా కోసమే జలవనరుల శాఖ అధికారులు డ్రోన్ ఉపయోగించారని ఆయన పేర్కొన్నారు. సమాచార లోపమే ఈ వివాదానికి దారి తీసిందని, దీనిని రాజకీయం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఇకపై ఎవరైనా డ్రోన్‌లు ఉపయోగించాలంటే స్థానిక పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనని డీజీపీ స్పష్టంచేశారు. కాగా ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉంటున్న నివాసం వద్ద డ్రోన్‌లు ఎగరడంపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య పెద్దఎత్తున మాటల యుద్ధం నడిచిన విషయం విదితమే. దీనిపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా డీజీపీకి, గుంటూరు అర్బన్ ఎస్పీకి ఫోన్‌చేసి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. డ్రోన్‌లతో చిత్రీకరించడంపై సోమవారం టీడీపీ ముఖ్య నేతలు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి పరిస్థితిని వివరించారు.