రాష్ట్రీయం

శాస్ర్తియంగానే వరద నీటి విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : కృష్ణా వరద నీటిని శాస్ర్తియంగానే దిగువకు విడుదల చేశామని, ఇప్పటి వరకూ 250 టీఎంసీల నీటిని సముద్రంలోకి వదిలామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. రాష్ట్రంపై వరద ప్రభావం మరో 15 రోజులు ఉంటుందని, ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అధికారులతో సమీక్షలు చేయడం ఒక్కటే తమ పని కాదని, క్షేత్ర స్థాయిలో ప్రజల బాగోగులు పట్టించుకోవాల్సిన బాధ్యత కూడా తమపై ఉందని గుర్తు చేశారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ సరైన సమయంలోనే వరద నీటిని విడుదల చేశామన్నారు. వరద ప్రాంతాల్లో అన్ని సహాయక చర్యలు తీసుకున్నామని వివరించారు. శాస్ర్తియంగానే నీటిని విడుదల చేస్తారని, ఎవరికి నచ్చినట్లు వారు విడుదల చేసే పరిస్థితి ఉండదన్నారు. వరద నీరు వచ్చినప్పుడు కొన్ని ఇళ్లు, పొలాలు మునగడం సహజమని వ్యాఖ్యానించారు. దీనిని రాజకీయం చేయడం సరికాదన్నారు. కొందరు రాజకీయ లబ్ధికోసం దిగజారుడు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి వచ్చే వరద నీరు తగ్గుముఖం పట్టిందన్నారు. ఇప్పటి వరకూ ఆరు రోజుల పాటు 8 లక్షల క్యూసెక్కుల శ్రీశైలం నుంచి దిగువకు విడుదల చేశామన్నారు. గరిష్ఠంగా
8.05 లక్షల క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజీ నుంచి వదిలినట్లు తెలిపారు. పైనుంచి బ్యారేజ్‌కు వచ్చే వరద పెరుగుతున్నప్పుడు సకాలంలో స్పందించి దిగువకు విడుదల చేశామన్నారు. సకాలంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నప్పటికీ, కొంతమంది అర్థంపర్థం లేని విమర్శలు చేస్తున్నారన్నారు. 10 లక్షల క్యూసెక్కుల వరకూ నీటిని ఆపి ఉంటే కరకట్ట ప్రాంతం అంతా మునిగేదని, అధికార యంత్రాంగం ముందే అప్రమత్తమైనందున కరకట్ట ప్రాంతాన్ని ముంపునుంచి కాపాడగలిగామని వివరించారు. 2009 తరువాత ఇప్పుడే ఇంత భారీగా వరద వచ్చిందని గర్తుచేశారు. కృష్ణా జిల్లాలో 46 గ్రామాలు, గుంటూరు జిల్లాలో 53 గ్రామాలు సహా 14 మండలాలు ముంపునకు గురైయ్యాయని, ఈ మేరకు అధికారులు ప్రాథమిక నివేదిక ఇచ్చారన్నారు. కృష్ణా జిల్లాలో 15 వేలమంది, గుంటూరు జిల్లాలో 3800 మంది ముంపుబాధితులు ఉన్నారన్నారు. అమెరికాలో ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి అధికారులను, మంత్రులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారన్నారు. ప్రజలకు ఎప్పుడూ ప్రభుత్వం జవాబుదారీగా ఉంటుందన్నారు. వరద నీటిని రాయలసీమకు మళ్లించే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఇప్పటి వరకూ రోజుకు 4 టీఎంసీల నీరు చొప్పున 35 టీఎంసీ నీటిని మళ్లించే ప్రయత్నం చేశామన్నారు. రాయలసీమలోని ప్రతి జిల్లాలో తాగునీటి రిజర్వాయర్లు ముందుగా నింపుతామన్నారు. ఇప్పటి వరకూ వెలుగోడు, గోరుకల్లు రిజర్వాయరు వరకూ నీళ్లు పంపామన్నారు. సోమశిల, అవుకు, గండికోటకు పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.

చిత్రం...విలేఖరులతో మాట్లాడుతున్న మంత్రి అనిల్‌కుమార్ యాదవ్