రాష్ట్రీయం

ఏఓబీలో కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, కొయ్యూరు, జీకేవీధి : ఆంధ్రా- ఒడిశా సరిహద్దు ప్రాంతంలో పోలీసులకు, మావోలకు మధ్య సోమవారం ఎదురుకాల్పులు జరిగాయి. విశాఖ జిల్లా కొయ్యూరు మండలంలోని మావోయిస్టు ప్రాబల్య ప్రాంతమైన మఠం బీమవరం పంచాయతీ మండపల్లి సమీప అటవీ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య గంటన్నర వ్యవధిలో రెండు సార్లు కాల్పులు జరిగినట్లు సమాచారం. మావోయిస్టుల ఏరివేత కార్యక్రమంలో భాగంగా కూంబింగ్ చేపడుతున్న సీఆర్‌ఫీఎఫ్, స్థానిక పోలీసులకు మావోయిస్టులు తారస పడడంతో ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్నూడూ లేని విధంగా గంటన్నర పాటు కాల్పులు జరగడం, ఈ కాల్పులు కూడా సీనియర్ మావోయిస్టుల పర్యవేక్షణలోనే జరిగనట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఎదురుకాల్పుల్లో కచ్చితంగా మావోలు మృతి చెందిన ఉంటారని పోలీసు వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నప్పటికీ, అటవీ ప్రాంతం కావడంతో సాయంత్రానికి వెలుతురు సరిగా లేకపోవడంతో ఘటనా స్థలంలో ఏ స్థాయి ప్రమాదం జరిగిందో ఇటు పోలీసులకు, మీడియా ప్రతినిధులకు పూర్తిస్థాయి సమాచారం లేదు. ఈ ఘటనలో గిరిజనులే హతమై ఉంటారనే వదంతులు కూడా వ్యాపించాయి. గాలికొండ ఏరియా కమిటీ కీలక నేత ఆధ్వర్యంలో సుమారు 30 మంది దళ సభ్యులు రెండు రోజులుగా పుట్టుకోట, మండపల్లి అటవీ ప్రాంతంలో సంచరించినట్టు స్థానికుల సమాచారం. ఈ నేపథ్యంలోనే పోలీసు బలగాలు కూబింగ్‌ను మరింత ముమ్మ రం చేసాయి.. ఏవోబీ ప్రాంతంలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో కీలక నేతలైన ఏవోబీ మిలట్రీ చీఫ్ చలపతి, అరుణ త్రుటిలో తప్పించుకున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. మరో విషయం ఏమిటంటే ఏవోబిలో మావోలు సంచరిస్తున్నట్లు పోలీసులకు ముందస్తు సమాచారం అందడంతోనే కూంబింగ్‌ను విస్తృతం చేశారు. ఈ విషయమై జిల్లా ఎస్పీ అట్టాడ బాపూజీని వివరణ కోరగా కొయ్యూరు ప్రాంతంలో ఎదురుకాల్పుల ఘటన వాస్తవమేనని, అయితే ఇరు వర్గాలకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు తారస పడ్డ మావోయిస్టులే ముందుగా కాల్పులు జరిపారన్నారు. కాల్పుల అనంతరం ఆ ప్రాదేశంలో మావోయిస్టులకు చెందిన విప్లవ సాహిత్యం, బ్లాక్ షిట్స్, కొంత వంట సామగ్రి లభ్యమయ్యాయని, సరిహద్దుల్లో గంటన్నర వ్యవధిలో రెండు మారు ఎదురుకాల్పులు జరగడంతో మారు మూల ప్రాంత గిరిజనం భయందోళనతో ఉలిక్కిపాటుకు గురయ్యారంటూ స్థానిక మంప పోలీస్ అధికారులు సమాచారం అందించారన్నారు.