రాష్ట్రీయం

ఉత్తర తమిళనాడు పరిసరాల్లో ‘ఆవర్తనం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 19: ఉత్తర తమిళనాడు, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం సోమవారం రాత్రి పేర్కొంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రాలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఈ కేంద్రం తెలిపింది. మరికొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని కేంద్రం వివరించింది. ఉరుములతో కూడిన, కొద్దిపాటి గాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని కేంద్రం తెలియజేసింది. నైరుతి రుతుపవనాలు సాధారణంగానే ఉన్నందున అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని కేంద్రం పేర్కొంది.