రాష్ట్రీయం

మళ్లీ తెరపైకి ప్రాంతీయ బోర్డులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, డిసెంబర్ 8: తెరమరుగైన ప్రాంతీయ అభివృద్ధి బోర్డులను తిరిగి ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి పనుల పర్యవేక్షణకు ప్రత్యేకంగా బోర్డులు ఉంటే వాటి ద్వారా కార్యక్రమాలను నిర్వహించవచ్చన్న ఆలోచన కేంద్రానికి ఉందని సమాచారం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరినట్లు సమాచారం. దేశంలో ఆరుసూత్రాల పథకం అమలు కోసం 1970లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ తెలంగాణ అభివృద్ధి బోర్డు, 1972-73లో ఆంధ్రా, రాయలసీమ అభివృద్ధి బోర్డులను నెలకొల్పారు. అయితే ఆ బోర్డులేవీ కార్యకలాపాలు నిర్వహించలేదు. 1983లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎన్టీ రామారావు ఆ ఆదేశాలను రద్దు చేశారు. ప్రాంతీయ అభివృద్ధి బోర్డుల వల్ల ఎలాంటి ప్రయోజనం లేనపుడు వాటిని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని ఎన్టీఆర్ స్పష్టం చేశారు. 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం తిరిగి ప్రాంతీయ అభివృద్ధి బోర్డులను పునరుద్ధరిస్తూ 2007 ఏప్రిల్ 26న నిర్ణయం తీసుకుంది. అయితే కోస్తాంధ్ర అభివృద్ధి బోర్డును రెండుగా చేసి ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాగా విభజించి ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు అభివృద్ధి బోర్డులను ఏర్పాటు చేశారు. అధ్యక్షులుగా నియమితులైన వారికి కేబినెట్ మంత్రి హోదా కల్పించి, నిధుల వినియోగ బాధ్యతలు అప్పగించారు. అయితే ఎలాంటి నిధులు విడుదల కాకపోగా విధులు సైతం లేకపోవడంతో కాలక్రమేణ ఆ బోర్డులు పనిచేయడం మానేశాయి.
తాజాగా విభజన నేపథ్యంలో రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు అయిదేళ్ల కాలంలో రూ.3,500కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించాలని చట్టంలో పొందుపర్చారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు కేవలం రూ.350 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. ఇటీవలి కాలంలో రాయలసీమ వాదం పెరగడం, కొత్త రాష్ట్రంలో ప్రాంతీయ విబేధాలు నెలకొనే ప్రమాదం పొంచి ఉండటంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అభివృద్ధిని వేగిరం చేయాలని సీఎం భావిస్తూ కేంద్ర నుంచి రావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరారు. దీంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి బోర్డులను ఏర్పాటు చేసి వాటి ద్వారా కేంద్ర నిధులను ఖర్చు చేయాలన్న ఆలోచనతో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ప్రాంతీయ అభివృద్ధి బోర్డుల ఏర్పాటుకు కేంద్రం ప్రతిపాదించి ఉంటుందని విశే్లషకులు భావిస్తున్నారు.

అనుమతి లేదు
వర్శిటీ అధికారులు

హైదరాబాద్, డిసెంబర్ 8: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఫ్ ఫెస్టివల్‌ను నిర్వహించేందుకు అనుమతి లేదని వర్శిటీ అధికారులు మంగళవారం నాడు స్పష్టం చేశారు. బీఫ్ ఫెస్టివల్, పోర్కు ఫెస్టివల్, గో పూజ తదితర కార్యక్రమాలకు అనుమతి లేదని వర్శిటీ తరఫున పిఆర్‌ఓ డాక్టర్ ఇ సుజాత తెలిపారు. పిజి ప్రాక్టికల్ పరీక్షలు డిసెంబర్ 7న ప్రారంభం అయ్యాయని, థియిరీ పరీక్షలు డిసెంబర్ 14 నుండి మొదలవుతాయని, విద్యాత్మక వ్యవహారాలు దెబ్బతినకుండా విద్యార్ధులు సహకరించాలని ఆమె సూచించారు. పరిశోధక విద్యార్ధులు, బోధన, బోధనేతర సిబ్బంది సైతం ప్రశాంతవాతావరణం కొనసాగేలా చూడాలని ఆమె పేర్కొన్నారు.