రాష్ట్రీయం

కనీస వేతనం పది వేలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 17: ఒప్పంద (కాంట్రాక్ట్) కార్మికులకు శుభవార్త. కాంట్రా క్ట్ కార్మికుల నెల వేతనం కనీసం 10 వేల రూపాయలకు తగ్గకుండా ఉండాలని ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు జారీ చేశామని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లోని లక్షమంది కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికులకు ప్రయోజనం చేకూరుతుందని దత్తాత్రేయ ఆదివారం విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. అయితే ఈ ఆదేశాల అమలు అంశాన్ని న్యాయశాఖ పరిశీలనకు పంపించామని, ఒకటి, రెండు రోజుల్లో నివేదిక రాగానే కఠినంగా అమ లు చేస్తామని ఆయన వివరించారు. ఇప్పటివరకు కాంట్రాక్ట్ ఉద్యోగులకు సరైన విధంగా వేతనాలు లభించడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు 10 వేల కంటే ఎక్కువ మొత్తంలో చెల్లించినట్లయితే సంతోషమేనని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 10 వేలకు తగ్గకుండా ఉండాలన్నదే తమ ప్రభుత్వ అభిమతమని ఆయన చెప్పారు. కాంట్రాక్ట్ కార్మికులను ఇష్టం వచ్చినట్లు తొలగించేందుకు వీలు లేదని, వారికి 12 రకాల చట్టాలు అండగా ఉన్నాయని ఆయన తెలిపారు.
సోనామసూరి వరి పంటలో 13 రకాలు ఉంటే వాటిలో ఏడింటిని కేంద్రం గుర్తించిందని ఆయన తెలిపారు. తెలంగాణ సోనా మసూరి, బతుకమ్మ, సోమనాథ్ వంటి వాటిని ఆయన ఉదహరించారు. యాదాద్రి పెసర్ల వంటి వాటికి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన చేసిందని ఆయన ప్రశంసించారు. సింగరేణి గని ప్రమాదంపై తాను డైరెక్టర్ జనరల్ (మైనింగ్)తో మాట్లాడానని, దీనిపై విచారణ జరుగుతున్నదని ఆయన చెప్పారు.