రాష్ట్రీయం

విపత్తులకూ రాజకీయ రంగు.. బాబుకు అలవాటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 20: విపత్తులను రాజకీయం చేస్తూ తనకు అనుకూలంగా మలచుకోడవం టీడీపీ అధినేత చంద్రబాబుకు అలవాటేనని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖ వైసీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోదావరి, కృష్ణా వరదల్లో ప్రభుత్వం ముందస్తుగా తీసుకున్న చర్యల వల్లే ప్రాణ, ఆస్తి నష్టాలను నియంత్రించగలిగామన్నారు. వరద ప్రభావంపై సీఎం జగన్ నిరంతరం సమీక్షిస్తూ అప్రమత్తం చేశారని స్పష్టం చేశారు. ప్రచార ఆర్భాటం, దోపిడీకి ఆస్కారం లేకుండా సహాయ, పునరావాస చర్యలు పూర్తి సమన్వయంతో కొనసాగించామన్నారు. వరదలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఇప్పుడు పర్యటనకు వస్తున్న చంద్రబాబుకు ప్రజలపై ఎంత ప్రేమ ఉందో అర్ధం చేసుకోవాలన్నారు. ముందస్తుగా వరద అంచనా, నష్ట నివారణ తదితర అంశాల్లో ప్రభుత్వం విఫలమైందంటూ టీడీపీ చేస్తున్నది అసత్య ప్రచారమని ఖండించారు. వరద ప్రాంతాల్లో మంత్రులు, యంత్రాంగం పర్యటించిందని, కృష్ణా కరకట్టను వరద ముంచెత్తడం వల్లే చంద్రబాబు నివాసం నీట మునిగిందని, దీన్ని కూడా టీడీపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. వరద నష్టాన్ని అంచనావేసేందుకే ఈ ప్రాంతంలో డ్రోన్లను వినియోగించారని, దీన్ని రాజకీయం చేయడం తగదని హితవు పలికారు. పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీళ్లు చేరి జలకళ ఉట్టిపడుతోందని, దీన్ని టీడీపీ ఓర్వలేకపోతోందన్నారు. రాజధాని అమరావతి ప్రాంతంపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు మంత్రి బొత్స స్పందిస్తూ గతంలోనే శివరామకృష్ణ కమిషన్ ఈ ప్రాంతంలో రాజధాని నిర్మాణం సరికాదన్న అభిప్రాయం వ్యక్తపరిచిందని గుర్తు చేశారు. రాజధాని నిర్మాణంపై మరోసారి విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇసుక దందాకు తెరదించేందుకే ప్రభుత్వం కొత్త పాలసీని అందుబాటులోకి తెస్తోందన్నారు. సామాన్యుల అవసరాల మేరకు ఇసుక సరఫరా చేస్తామన్నారు. విశాఖలో మూడుసార్లు పెట్టుబడుల సదస్సులు నిర్వహించిన చంద్రబాబు రాష్ట్రానికి రూ.20 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయంటూ ప్రచారం చేసుకున్నారని, విశాఖకు వచ్చిన ఒక పరిశ్రమ పేరు వెల్లడించాలని సవాలు చేశారు. ప్రచార ఆర్భాటాలకు, దుబారా ఖర్చుకు అవకాశం లేకుండా డిప్లమాటిక్ ఔట్‌రీచ్ ద్వారా 30 దేశాల ప్రతినిధులు హాజరై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారన్నారు. రాష్ట్రంలో స్ధానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే నిర్వహిస్తామని, తొలుత మండల, జిల్లా పరిషత్‌లకు, అనంతరం పంచాయతీలకు, చివరగా మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు పాలన చేరువ చేసేందుకు తీసుకువస్తున్న గ్రామ సచివాలయ వ్యవస్థపై బొత్స స్పందించారు. గ్రామ సచివాలయ కొలువుల్లో పూర్తి పారదర్శకత ఉంటుందన్నారు. ఎటువంటి ప్రలోభాలకు ఆస్కారం ఉండదని, ఒక వేళ అటువంటి ప్రలోభాలు ప్రచారంలోకి వస్తే ఫిర్యాదు చేయాలని సూచించారు. రాష్ట్రంలో పాలన పట్ల ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారని అన్నారు. అధికారం కోల్పోయిన దుగ్దతోనే టీడీపీ అసత్య ప్రచారం కొనసాగిస్తోంది మండిపడ్డారు. సమావేశంలో ఎమ్మెల్యేలు నాగిరెడ్డి, అదీప్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం...విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి బొత్స సత్యనారాయణ