రాష్ట్రీయం

పారదర్శకతే గీటురాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఇళ్ల కేటాయింపులు, నిర్మాణాలను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు ఆదేశించారు. ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలన్నారు. వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ అధికారులో బుధవారం మంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్న శాఖ గృహ నిర్మాణ శాఖ అని గుర్తు చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యతల్లో గృహ నిర్మాణం ఒకటన్నారు. గతంలో జన్మభూమి కమిటీల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక జరిగిందని, అటువంటి విమర్శలకు తావు లేకుండా పారదర్శకంగా గృహల మంజూరు ఉండాలన్నారు. రాష్ట్రంలో గతంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి 840 కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉన్నాయని, త్వరలో 500 కోట్ల రూపాయల విడుదలకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇళ్ల నిర్మాణాల ప్రగతిని తెలుసుకునేందుకు వీలుగా ఒక యాప్ అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ప్రతి ఒక్కరూ జవాబుదారీతనంతో వ్యవహరించాలన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 123 నియోజకవర్గాలు కేంద్ర పట్టణ హౌసింగ్ పరిధిలో ఉన్నాయని, ఈ మేరకు కేంద్రం నుంచి నిధులు
తీసుకురావాల్సి ఉందన్నారు. గృహ నిర్మాణ ఉద్యోగుల సంక్షేమం తన బాధ్యత అని, మధ్యంతర భృతి గురించి ముఖ్యమంత్రితో చర్చిస్తానని హామీ ఇచ్చారు. సమస్యలు ఉంటాయని, క్షేత్ర స్థాయిలో విధులను నిబద్ధతతో చేపట్టాలన్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ పథకాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు అందరం కలిసి సమష్టిగా పని చేద్దామన్నారు. ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జి.అనంతరామ్, ఎండీ కాంతిలాల్ దండే, 13 జిల్లాల ప్రాజెక్టు డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... గృహ నిర్మాణంపై సమీక్షిస్తున్న మంత్రి శ్రీరంగనాథ రాజు