రాష్ట్రీయం

స్థానికులకే పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఆగస్టు 21: రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెట్టుబల రంగం నిర్వీర్యం అవుతోందని, పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని రాష్ట్ర భారీపరిశ్రమలు, వాణిజ్యం, ఐటి శాఖామంత్రి మేకపాటి గౌతంరెడ్డి పేర్కొన్నారు. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం జరిగిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమలు స్థాపించి రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టించడమే ప్రభుత్వం లక్ష్యమన్నారు. ప్రతి మూడు నెలలకొసారి పరిశ్రమల సమస్యల తెలుసుకుని పరిష్కరిస్తామన్నారు. రాష్ట్రానికి వై ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమం త్రి కావడం అదృష్టమన్నారు. స్పష్టమైన పాలసీ విధానాన్ని తీసుకొచ్చి త్వరలోనే బిల్‌గేట్స్, అంబానీ, అదాని వంటి వారిగా పారిశ్రామిక వేత్తలను మారుస్తామని ఆయన తెలిపారు. పారిశ్రామిక వేత్తలుగా మారాలంటే పాలసీ ముఖ్యమన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం ప్రతి మూడునెలలకొసారి పరిశ్రమల సమస్యలను తెలుసుకుంటామన్నారు. జిల్లాలో పెట్టుబడులకు, పరిశ్రమల స్థాపనకు సిద్ధమైన పారిశ్రామిక వేత్తలతో, గతంలోనే పరిశ్రమలు స్థాపించిన వారితో మంత్రి మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకుని త్వరితగతిన వాటిని పరిష్కరిచేందుకు కృషిచేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రపంచ స్థాయి పరిశ్రమలు నెలకొల్పుతామని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి శ్రామిక శక్తి స్థాయిని పెంచుతామని ఆయన తెలిపారు. నైపుణ్య శిక్షణ అందించేందుకు ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక శిక్షణాకేంద్రాన్ని ఏర్పాటు చేస్తారన్నారు. నియోజకవర్గాల వారీగా జిల్లాల వారీగా ఏ పరిశ్రమలను అక్కడ వాతావరణానికి అనుకూలంగా అవసరాలకు అనుకూలంగా స్థాపించవచ్చో, ఏది నెలకొల్పితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయో పరిశీలించిన అనంతరం విధివిధాలు రూపొందిస్తామని ఆయన తెలిపారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం పరిపాలన చేపట్టిన ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో పూర్తిగా అవినీతి, అక్రమాల వల్ల పారిశ్రామిక రంగం కుంటుపడిందన్నారు. గత ప్రభుత్వ లక్ష్యాలను సాధించిన గణాంకాలు వాస్తవ వివరాలను పరిశీలిస్తే వారు పాలన ఏ విధంగా వుందో అర్ధమవుతుందన్నారు. హామీ ఇచ్చినట్లు పరిశ్రమలకు నీరు ఇవ్వలేదు. విద్యుత్ అందించలేదన్నారు. ప్రోత్సహకాలు చెల్లించలేదని పారిశ్రామిక వేత్తలుకు అబద్దాలు చెప్పి మోసం చేసారని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వం తప్పిదాలకు అన్ని రకాల అవమాన, ఆర్ధిక భారాలను ప్రస్తుత ప్రభుత్వం మోయాల్సివస్తోందన్నారు.
పరిశ్రమల్లో స్థానికులకు పెద్దపీట: మంత్రి అనిల్
రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి అనిల్‌కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య లక్ష్యమన్నారు. రాష్ట్రానికి గొప్పగొప్ప పరిశ్రమలు రావాలని, పరిశ్రమలకు అవసరమైన నీరుగా పుష్కలంగా వుందని ఆయన తెలిపారు. పరిశ్రమలో స్థానిక యువతకు 75 శాతం ఉద్యోగాలు కల్పించేలా చట్టం చేయడం గొప్ప ఆలోచన అని ఆ ఘనత వై ఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి దక్కిందన్నారు. ఏపీ ఐఐసీ చైర్‌పర్సన్ రోజా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక వేత్తలకు ఏపీ ఐఐసీ అండగా ఉంటుదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాథమికంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంతో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారని ఆమె తెలిపారు. రాష్ట్రంలో 31 ఎంఎస్‌ఎం పార్కులను అభివృద్ధి చేస్తామని ఆమె తెలిపారు. ఇందుకోసం 12వేల ఎకరాలకు పైగా భూమి అందుబాటులో ఉందని ఆమె తెలిపారు. పారిశ్రామిక వేత్తలు స్వేచ్చగా పరిశ్రమలు స్థాపించే వాతావరణాన్ని రాష్ట్రంలో కల్పిస్తామని రోజా తెలిపారు. త్వరలోనే ఐటి పాలసీని ప్రకటిస్తామని, రాయితీలు అందరికీ సమానంగా ఉండే విధంగానే సీఎం జగన్ అభిమతమని ఆమె తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలు వెనక్కిపోతున్నాయని తెలుగుదేశం నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె విమర్శించారు. పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ బహుబలి లాంటి వారని మంత్రి గౌతంరెడ్డి సైరా నరసింహారెడ్డి లాంటి వారని వీరిద్దరు పెద్ద పారిశ్రామిక వేత్తలని, వీరే రాష్ట్రానికి మంచి పారిశ్రామిక పాలసీలు తీసువస్తారని ఆమె తెలిపారు. నిర్ణీత సమయంలో పారిశ్రామిక వేత్తలకు అనుమతులు ఇస్తాం, పైసా లంచం ఇవ్వకుండా అనుమతులు ఇవ్వాలని లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం పెద్దలకు ఒక్కొక్క పరిశ్రమకు ఒక్కొక్క రకమైన పాలసీ ఇచ్చి రాష్ట్ర ఖజానాకకు గండి కొట్టారని ఆమె తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ సదస్సులో ఐటీ ప్రిన్స్‌పల్ సెక్రటరీ రజత్‌భార్గవ్, ఐటీ కమిషనర్ సిద్దార్ధ జైన్, జిల్లా కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు, ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, వి వరప్రసాద్, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

చిత్రం... పారిశ్రామిక సదస్సును జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న మంత్రి మేకపాటి