రాష్ట్రీయం

రాజధాని తరలిస్తే మహోద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు : రాష్ట్రం నడిబొడ్డున అన్ని ప్రాంతాల ప్రజలకు అందుబాటులో రాజధాని ఉండాలన్న సంకల్పంతో తాము అమరావతిని ఎంచుకుని అభివృద్ధికి శ్రీకారం చుట్టామని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని తరలింపుపై చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని తరలింపు ప్రయత్నాలు చేపడితే మహోద్యమానికైనా తాము వెనుకాడేది లేదని పుల్లారావు స్పష్టంచేశారు. బుధవారం గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేస్తారని ప్రజలు అధికారం కట్టబెడితే వైసీపీ నేతలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నాలు తగదన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు అమరావతిలో నిర్మించిన రాజధానిని దొనకొండ, ఇడుపులపాయకు తరలించే ప్రయత్నాలను తాము అడ్డుకుంటామని తెలిపారు. ఆమరణ దీక్ష చేపట్టేందుకైనా తాము సిద్ధమని ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన విజ్ఞప్తి మేరకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా 33 వేల ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా రాజధాని నిర్మాణానికి ఇచ్చారన్నారు. కేంద్రప్రభుత్వం వెంటనే స్పందించి వైసీపీ ప్రభుత్వం కుయుక్తులను అడ్డుకట్ట వేయాలని కోరారు. నీటి ప్రవాహాన్ని అడ్డుకుని అమరావతిని ముంచే ప్రయత్నం చేశారని ఆరోపించారు.