రాష్ట్రీయం

గ్రామీణ వికాసమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, సిద్దిపేట, ఆగస్టు 21: గ్రామీణ వికాసం లక్ష్యం గా, గజ్వేల్ అభివృద్ధి స్ఫూర్తితో ప్రభుత్వ యంత్రాంగం ముందుకు సాగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా కోమటిబండ మిషన్‌భగీరథ హెడ్ రెగ్యులేటర్ వద్ద గల నాలెడ్జ్ సెంటర్‌లో బుధవారం సాయంత్రం మంత్రులు, కలెక్టర్‌లకు నిర్వహించిన సమీక్షా సమావేశంలో దిశానిర్దేశం చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం
చుడుతుండగా, కొత్త మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీ రాజ్ చట్టాల రూపకల్పనను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం, గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేయడంతో పాటు సమన్వయంతోనే సత్ఫలితాలు సాదించవచ్చని స్పష్టం చేశారు. ముఖ్యంగా అడవుల పునరుజ్జీవంలో భాగంగా హరితహారం విజయవంతంతోనే జీవ వైవిధ్యం సాధ్యపడుతుందని తెలిపారు. రాష్ట్రం లో 66.48 లక్షల ఎకరాల అటవీ భూమి ఉండగా, మూడేళ్ల కితం ప్రారంభమైన అటవీ పునరుజ్జీవ పనులు చక్కటి ఫలితాలనిస్తున్నట్ట్లు చెప్పారు. అటవీ భూమి సరైన నిష్పత్తిలో లేని కారణంగానే క్షామం ఏర్పడి కరవు కాటకాలు కాటు వేస్తున్నట్టు పేర్కొన్నారు. గజ్వేల్ ప్రాంతంలో సహజ సిద్దమైన పద్ధతిలో చెట్ల పెంపకానికి శ్రీకారం చుట్టగా, అటవీ శాఖ అధికారుల కృషి ఎంతో ఉన్నట్టు తెలిపారు. కోమటిబండ అటవీ ప్రాంతంలో 27 రకాల పండ్ల మొక్కల పెంపకంతో మంకీఫుడ్ కోర్టులు తయారవుతుండగా, అడవుల చుట్టూ కందకాలు ఏర్పాటు చేయడంతో పూర్తి రక్షణ ఉన్నట్టు స్పష్టం చేశారు. అలాగే కందకాల ఏర్పాటుతో నీటి నిల్వలు పెరుగుదలకు దోహదపడుతుండగా, కందకాల కట్టలపై గచ్చకాయ చెట్లు నాటడంతో అడవులను రక్షించేందుకు వీలు కలుగుతున్నట్టు చెప్పారు. విరివిగా మొక్కలు నాటి సంరక్షించడంతో వాతావరణ సమతుల్యత, కాలుష్య నిర్మూలన, ఉష్ణోగ్రతల తగ్గుదల, సమృద్ధిగా వర్షాలు, భూగర్భ జలాల పెరుగుదల సాధ్యపడుతుందని అన్నారు. అయితే అడవులను సంరక్షించే బాధ్యత మంత్రులు, కలెక్టర్‌లు, ఎమ్మెల్యేలపైనే ఉండగా, పల్లెలు, పట్టణాలు, పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఇందుకోసం 60 రోజుల ప్రణాళికను సిద్ధం చేసుకొని అమలు చేయాలని కోరారు. అవినీతికి అవకాశం లేని, రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేని పారదర్శకమైన పాలన అందించేందుకు ప్రభు త్వం వివిధ అంశాలకు ప్రాధాన్యత ఇస్తుండగా, కలెక్టర్‌లు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల ఈశ్వర్, నిరంజన్‌రెడ్డి, మల్లారెడ్డి, ప్రణాళికా సంఘం వైస్ చెర్మన్ వినోద్, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శేరి సుభాషరెడ్డి, సీఎంఓ కార్యదర్శి నర్సింగరావు, కార్పొరేషన్ చైరన్‌లు భూపతిరెడ్డి, భూంరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, సీనియర్ నేతలు వంటేరు ప్రతాప్‌రెడ్డి, డాక్టర్ యాదవరెడ్డిలతో పాటు ఆయా జిల్లాల కలెక్టర్‌లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

చిత్రం... జిల్లా కలెక్టర్‌ల క్షేత్ర సందర్శనలో కోమటిబండలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్