రాష్ట్రీయం

అడవుల పెంపకానికి సమగ్ర కార్యాచరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, సిద్దిపేట, ఆగస్టు 21: అడవుల సంరక్షణతోనే భవిష్యత్తు తరాలకు మెరుగైన ఆరోగ్యం అందించగలుగుతామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. గజ్వేల్ ప్రాంతంలో మూడేళ్లక్రితం ఆరంభమైన పునరుజ్జీవ పనులు చక్కటి ఫలితాలనిస్తున్నాయని వెల్లడించారు. బుధవారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సింగాయపల్లి, నెంటూరు, గజ్వేల్ మండలం కోమటిబండలలో అటవీ ప్రాంతాలను మంత్రులు, కలెక్టర్‌లతో కలిసి పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. అడవులను పునరుద్ధరించాలనే లక్ష్యంతో సమగ్ర ప్రణాళిక రూపొందించి, కార్యాచరణ ప్రారంభించాలని కలెక్టర్లకు సూచించారు. సామాజిక అడవుల పెంపకం, ఆవాస ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు ఉపయోగపడితే అడవుల పెంపకం మొత్తం వాతావరణంలో మార్పు తెస్తుందని, వర్షాలు బాగా కురవటానికి, జీవ వైవిధ్యానికి దోహదపడుతుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం అటవీ భూములు, చెట్లులేని ఎడారుల్లా మారిన దుస్థితి ఉండేదన్నారు. అడవిని పునరుద్ధరించాలనే లక్ష్యంతో సమగ్ర ప్రణాళికను రూపొందించి అమలు చేసినట్ట్లు తెలిపారు. మూడేళ్ల కిందట ప్రారంభమైన పునరుద్ధరణ పనుల సత్ఫలితాలు ఇప్పుడు ప్రత్యక్షంగా కన్పిస్తున్నాయన్నారు. ఈ ప్రాంతమంతా పచ్చని చెట్లతో కళకళలాడుతుందని, వర్షపాతం సైతం పెరిగిందన్నారు. 27 రకాల పండ్ల మొక్కలు ఈ అడవుల్లో పెంచటం వల్ల కోతులకు మంకీ ఫుడ్‌కోర్టులా తయారవుతున్నాయని సీఎం చెప్పారు. రాష్ట్రంలో 66.48 లక్షల ఎకరాల అటవీ భూమి ఉందని, ఇది మన భూభాగంలో 23.4 శాతం అని సీఎం తెలిపారు. ఇంత అటవీభూమి ఉన్నప్పటికీ అదే నిష్పత్తిలో అడవులు లేవని చెప్పారు. అడవులను కాపాడేందుకు మొక్కలు నాటడం ఏకైక మార్గమన్నారు. చెట్లను పెద్దఎత్తున పెంచి అడవులను పునరుద్ధరించాలన్నారు. అడవుల పునరుద్ధరణకు అవసరమయ్యే కంపా నిధులు అందుబాటులో ఉన్నాయన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు ఈ బాధ్యతను తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. అడవుల పునరుజ్జీవంలో భాగంగా హరితహారాన్ని సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తుండగా, బీడు, అటవీ, ప్రభుత్వ భూములలో ప్రత్యామ్నాయ అడవుల పెంపకం, అర్బన్ పార్కుల ఏర్పాటు విస్తృతం చేసినట్టు పేర్కొన్నారు. కోమటిబండ, సింగాయపల్లి ప్రాంతాలలోని 2700 ఎకరాలలో అడవుల పెంపకంపై దృష్టి పెట్టగా, మెరుగైన ఫలితాలు సాధిస్తున్నట్టు సీఎం వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అటవీ శాఖ పీసీసీఎఫ్ శోభ, ఏపీసీసీఎఫ్ డోబ్రియాల్, జిల్లా అటవీ అధికారి శ్రీ్ధర్‌రావులు సీఎం కేసీఆర్, మంత్రులు, కలెక్టర్ లకు సింగాయపల్లి, నెంటూరు, కోమటిబండ ప్రాంతాలలో అడవుల పునరుజ్జీవంపై వివరించగా, ఫొటో ఎగ్జిబిషన్‌ను కూడా ఏర్పాటు చేసి సవివరంగా అవగాహన కల్పించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, మంత్రులు నిరంజన్‌రెడ్డి, ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్‌యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, సంతోష్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, హరితహారం ఓఎస్‌డీ ప్రియాంకవర్గీస్, జిల్లా అటవీ అధికారి శ్రీ్ధర్‌రావుతో పాటు కలెక్టర్‌లు, వివిధ కార్పొరేషన్‌ల చెర్మన్‌లు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... సింగాయపల్లి అటవీ ప్రాంతంలో అడవుల పునరుజ్జీవంపై ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా సీఎం కేసీఆర్‌కు వివరిస్తున్న రాష్ట్ర అటవీ అధికారులు శోభ, డోబ్రియాల్