రాష్ట్రీయం

రెండో రాజధాని ప్రచారంలో వాస్తవం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 21: హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేస్తారనే ప్రచారంలో నిజంలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ వార్తల్లో వాస్తవం లేదన్నారు. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా అంటే ఎవరో తనకు తెలియదని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొనడం మంచి సంస్కృతి కాదని, అహంకారపూరితమైన మాటలు మాట్లాడరాదని హితవుపలికారు. ఆయన ఇక్కడ మాట్లాడుతూ, గతంలో కేటీఆర్ కేంద్ర ఆరోగ్య శాఖమంత్రిగాపనిచేసిన నడ్డాను చాలాసార్లు కలిశారన్నారు. తాము కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే ఎవరని అనవచ్చని, కాని అది తమ సంప్రదాయం కాదన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్లమెంటులో పోరాడిన తెలంగాణ చిన్నమ్మ సుష్మాస్వరాజ్ అనారోగ్యంతో చనిపోతే టీఆర్‌ఎస్ నేతలు కనీసం నివాళులు అర్పించలేదన్నారు. ఏపీ రాజధాని మారుతుందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై తాము స్పందించాల్సిన అవసరం లేదన్నారు. దీనిపై కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఆయుష్మాన్ భవ కార్యక్రమం సరిగా అమలు కావడం లేదనే
విమర్శలు సరికావన్నారు. ఆరోగ్య శ్రీ కార్యక్రమాన్ని సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వంపై ఉందన్నారు. 2023లో తెలంగాణ అసెంబ్లీ మీద జెండా ఎగురవేయడం తమ లక్ష్యమని ఆయన చెప్పారు.
నడ్డాకు కృతజ్ఞతలు తెలిపిన మాజీ ఎంపీ జీ వివేక్
రాష్ట్రప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ ప్రజలకు ఆరోగ్యశ్రీ అందించినందుకు బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నడ్డాకు మాజీ ఎంపీ జీ వివేక్ కృతజ్ఞతలు తెలిపారు. పేద ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్న ప్రభుత్వం జేపీ నడ్డాప్రకటనతో దిగిరాక తప్పలేదన్నారు. ఆరోగ్యశ్రీని పునరుద్ధరించక తప్పలేదన్నారు. నడ్డా ప్రకటన ప్రభుత్వంపై వత్తిడి పెరిగిందన్నారు. ఇక్కడి ప్రజల కష్టాలను తీర్చిన నడ్డాకు తెలంగాణ ప్రజల తరఫున ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారన్నారు.

చిత్రం... బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రులు సంతోష్‌కుమార్ గంగ్వార్, కిషన్ రెడ్డి