ఆంధ్రప్రదేశ్‌

‘పోలవరం’పై ఇప్పుడేం చెబుతారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 22: పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పుడేం చెబుతుందని టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సూటిగా ప్రశ్నించారు. గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం మీడియాతో జరిగిన ఇష్టాగోష్టిలో చంద్రబాబు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుపై ప్రయోగాలు వద్దని ఎవరెన్ని చెప్పినా మొండిగా, మూర్ఖంగా ప్రభుత్వం ముందుకెళ్లడంతోనే ఈ పరిస్థితి ఎదురైందన్నారు. ఇది ఇంతటితో ఆగదని, ఈ ఈ జాప్యం ప్రాజెక్టుపై మరింత ప్రభావం చూపబోతుందని పేర్కొన్నారు. జరగని అవినీతిని నిరూపించాలని అనేక ప్రయత్నాలు చేశారని, చివరకు కోర్టు ద్వారా మొట్టికాయలు వేయించుకున్నారని ఎద్దేవా చేశారు. ఒకసారి న్యాయ వివాదం మొదలైతే ప్రాజెక్టు పూర్తవడం కష్టమని ఆనాడు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గడ్కరీ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తుచేశారు. ప్రభుత్వానికి పిచ్చి అనుకోవాలో.. రాష్ట్రానికి పట్టిన శని అనుకోవాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడిందన్నారు. రివర్స్ టెండర్ల వల్ల ప్రాజెక్టుకు నష్టం జరగడంతో పాటు నిర్మాణాల్లో తీవ్ర జాప్యం నెలకొనే ప్రమాదం ఉందని తెలిపారు. ఇదే విషయాన్ని కేంద్రం చెబుతున్నప్పటికీ రాష్ట్రప్రభుత్వానికి తలకెక్కడం లేదని చంద్రబాబు పేర్కొన్నారు.
చిత్రం...టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు