రాష్ట్రీయం

గ్రామాలే లక్ష్యం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 22: గ్రామీణ ప్రాంతాలపై బ్యాంకర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని, గ్రామాల్లో బ్యాంకింగ్ రంగం ముందుకు వెళితే రాష్ట్రం, దేశం ఆర్థికంగా ముందుకు వెళుతుందని ఆ దిశగా బ్యాంకులు ఆలోచన చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. గురువారం నగరంలోని ఒక హోటల్‌లో లీడ్ బ్యాంక్ అయిన ఆంధ్ర బ్యాంక్ ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎల్వీ మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగం గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెడితే గ్రామాల నుండి పట్టణాలకు వలసలు తగ్గి స్థానికంగా ఉద్యోగావకాశాలు మెరుగుతావయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సరైన వౌలిక వసతులు లేక 40 శాతం మంది గ్రామాల నుండి పట్టణాలకు వలస వెళుతున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే బ్యాంకు మేనేజర్లకు ప్రాధాన్యత
ఇవ్వాలన్నారు. బ్యాంక్ మేనేజర్లు స్థానికంగా ఉండి గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, ప్రజల పరిస్ధితిని గమనించి సహకారం అందించాలన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు ప్రకారం భారతదేశం 5 ట్రిలియన్‌ల ఆర్థిక శక్తిగా ఎదగడానికి అందరూ కలిసికట్టుగా పని చేయాలన్నారు. నిర్ణీత కాలంలో ఆర్థిక వ్యవస్థ లక్ష్యాలను ఛేదించడానికి స్వల్పకాలిక, దీర్ఘకాలిక విధానాలతో ముందుకు వెళ్లాలన్నారు. ఆంధ్ర బ్యాంక్ లీడ్ మేనేజర్ జే పకిరిసామి మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థ ప్రధాన భూమికలో బ్యాంకర్స్ ప్రముఖపాత్ర నిర్వహిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో ఆంధ్రా బ్యాంక్ సర్కిల్ మేనేజర్, ఎస్‌ఏఎల్‌బీసీ కన్వీనర్ కేవీ నాంచారయ్య, ఆంధ్రా బ్యాంక్ జనరల్ మేనేజర్ కేఎస్‌డీ శివవరప్రసాదరావు, ఎస్‌ఎల్‌బీసీ ఏజీఎం కే అజయ్‌పాల్, కృష్ణా జిల్లా ఆంధ్రా బ్యాంక్ డీజీఎం ఎం వెంకటేశ్వరస్వామి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం...బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతున్న ఎల్వీ సుబ్రహ్మణ్యం