తెలంగాణ

సృజనాత్మకతతో అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : శాస్త్ర సాంకేతిక పరిజానం సామాన్యుడికి ఉపయోగపడాలని, అందుకే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని పకడ్బందీగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నామని పర్యావరణం, శాస్త్ర విజ్ఞాన శాఖామంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో రాష్ట్ర, జాతీయ శాస్త్ర సాంకేతిక మండళ్ల తొలి సమావేశాన్ని ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్‌కరెడ్డి మాట్లాడుతూ సృజనాత్మక ఆలోచనలతో రాష్ట్భ్రావృద్ధి సాకారమవుతుందని అన్నారు. దీనికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకృషి చేస్తున్నారని వెల్లడించారు. సమావేశంలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం సలహాదారు దేబప్రియ దత్త, డీఎస్టీ టీడీటీ మెంబర్ సెక్రటరీ రవీందర్ గౌర్, ముంబై ఐఐటీ ప్రొఫెసర్ సతీష్ బీ అగ్నిహోత్రి, తెలంగాణ సైన్స్ అండ్ టెక్నాలజీ మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ రవికుమార్ పులి, వివిధ రాష్ట్రాల
శాస్త్ర సాంకేతిక మండళ్ల కార్యనిర్వాహణ అధికారులు , శాస్తవ్రేత్తలు పాల్గొన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధన అభివృద్ధి, నూతన ఆవిష్కరణలకు సంబంధించి ప్రస్తుత దేశ పరిస్థితిని పూర్తిగా ఆకళింపు చేసుకుని తీసుకున్న చర్యలు తెలంగాణ ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలుపుతున్నాయని ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. టెక్నాలజీని వినియోగించుకోవడంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో ముందంజలో ఉందని, సాంకేతిక సాయంతో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందిస్తూనే, ఆర్ధిక పురోభివృద్ధికి బాటలు వేసుకుంటూ సీఎం కేటీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతోందని తెలిపారు. 20 ఏళ్లు పట్టే కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం ధృడసంకల్పం, ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని మూడేళ్లలో పూర్తి చేశామని అన్నారు. సముద్ర మట్టానికి మేటిగడ్డ 100 మీటర్ల ఎత్తులో ఉందని, 300 మీటర్ల నుండి 650 మీటర్ల ఎత్తువరకూ నీటిని తీసుకురావడం ఇంజనీర్ల అద్భుతమని చెప్పారు. రోజుకు మూడు టీఎంసీల నీటిని మళ్లించేలా డిజైన్ రూపొందించడం మామూలు విషయం కాదని, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకే కాకుండా దేశంలోనే అద్భుతమైన నిర్మాణమని అన్నారు. విధాన నిర్ణయాల్లో శాస్త్ర, సాంకేతికతను ఉపయోగించడం వల్ల అద్భుత ఫలితాలను రాబట్టవచ్చని, రైతులకు పెట్టుబడి సహాయం అందించేందుకు ఆన్‌లైన్‌లో నేరుగా వారి ఖాతాల్లో డబ్బు జమ అయ్యేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. 58.33 లక్షల మంది రైతులకు ఎకరాకుస 10వేల రూపాయిలను రెండు దఫాలుగా వారి అకౌంట్లలో జమ చేస్తున్నామని, ప్రతి నెల 39 లక్షల మందికి డిజిటల్ టెక్నాలజీతో ఆసరా పెన్షన్లను వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని చెప్పారు. పౌర సేవలకు సాంకేతికతను ఉపయోగించుకోవడం వల్ల డబ్బు నేరుగా వారి అందడంతో పాటు విలువైన సమయం కూడా ఆదా అవుతోందని, పారదర్శకత కూడా ఉంటుందని అన్నారు. ఇక వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హరితహారం చేపట్టిందని, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 24 శాతం పచ్చదనాన్ని 33 శాతానికి పెంచేందుకు తద్వారా పర్యావరణాన్ని కాపాడేందుకు తెలంగాణ సీఎం ఈ బృహత్తర కార్యక్రమానికి అంకురార్పణ చేశారని అన్నారు. ఇప్పటికే నాలుగేళ్లు పూర్తిచేసుకున్న ఈ కార్యక్రమం వరుసగా ఐదో ఏడాదిలోకి అడుగుపెట్టిందని, తెలంగాణ వ్యాప్తంగా ఐదేళ్ల కాలంలో 230 కోట్ల మొక్కలు నాటి, వాటిని సంరక్షించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి హరితహారం చేపట్టారని చెప్పారు. అటవీ ప్రాంతంలో 100 కోట్ల మొక్కలు, సామాజిక అడవుల కింద 120 కోట్ల మొక్కలను ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో నాటుతున్నామని, మరో 10 కోట్ల మొక్కలను జీహెచ్‌ఎంసీ , హెచ్‌ఎండీఏ పరిధిలో నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ఇంత వరకూ 113 కోట్ల మొక్కలను నాటామని, ఐదో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా 83 కోట్ల మొక్కలు నాటాలని నిర్దేశించామని చెప్పారు. ఎప్పటికపుడు ఇలాంటి సదస్సులుద్వారా సాధించిన అభివృద్ధిని సమీక్షించుకుని విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని మంత్రి సూచించారు. నూతన ధోరణులకు అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవల్సి ఉందని ఆయన చెప్పారు. ఈ సదస్సు మూడు రోజుల పాటు కొనసాగనుంది. ముగింపు కార్యక్రమం ఈ నెల 24న జరుగుతుంది.

చిత్రం...జాతీయ శాస్త్ర సాంకేతిక మండళ్ల సమావేశాన్ని ప్రారంభిస్తున్న మంత్రి