జాతీయ వార్తలు

నిండుకుండలా సాగర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, ఆగస్టు 22: నాగార్జునసాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు అతి చేరువలో నిండుకుండలా కనిపిస్తోంది. సాగర్‌లో జలాశయం నీటిమట్టం గురువారానికి 590 అడుగులు దాటుతుందని రెండవసారి సాగర్ డ్యాం గేట్లను ఎత్తాల్సిన పరిస్థితి ఉంటుందని డ్యాం దిగువన ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది. కాని గురువారం సాయంత్రానికి 590 అడుగులకు చేరుకోకపోవడంతో సాగర్ డ్యాం గేట్లను ఎత్తలేదు. సాగర్ జలాశయానికి ఎగువ నుండి 51,154 క్యూసెక్కుల నీరు మాత్రమే వచ్చి చేరుతుండగా దానిలో 16,646 విద్యుత్ ద్వారా, 9,160 కుడి కాల్వ ద్వారా, 6,401 ఎడమ కాల్వ ద్వారా, 2400 క్యూసెక్కులు ఎస్‌ఎల్‌బీసీ, వరద కాల్వ ద్వారా 300 క్యూసెక్కులు మొత్తంగా సాగర్ జలాశయం నుండి 34,915 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయంలో పూర్తిస్ధాయి 590 అడుగులకు గాను గురువారం సాయంత్రానికి 589.60 అడుగులకు చేరుకుంది. ఇది 311 టీఎంసీలకు సమానం. ప్రస్తుతం శ్రీశైలానికి ఎగువ నుండి 40,841 క్యూసెక్కుల నీరు వస్తుండగా ప్రస్తుతం శ్రీశైలంలో 884.40 అడుగులుగా ఉంది. సాగర్ జలాశయంలో పూర్తిస్థ్ధాయి నీటిమట్టం ఉండడంతో క్రస్టు గేట్లపై నుండి నీళ్లు జాలువారుతూ పాలధారలా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాయి.
ఆక్టోపస్ నిఘాలో సాగర్ డ్యాం
నాగార్జునసాగర్ ప్రాజెక్టుపై ఆక్టోపస్ దళాలు నిఘా పెట్టాయి. ఉగ్రవాదుల ముప్పు ఉందన్న సమాచార నేపథ్యంలో గురువారం నాడు హైద్రాబాద్‌కు చెందిన ఆక్టోపస్ విభాగం సాగర్ డ్యాంపై ఉగ్రవాదులు దాడి చేస్తే ఏ విధంగా ఎరుర్కోవాలన్న మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉగ్రవాదులపై ఎలా ఎదురుదాడి చేసి వారిని బంధించడం లాంటి సన్నివేశాలు నిర్వహించారు. ఇద్దరు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు, ఎస్‌ఐ ఆక్టోపస్ పాల్గొన్నారు.
చిత్రాలు.. గేట్లపై నుండి జాలువారుతున్న నీరు *డ్యాంపై ఆక్టోపస్ బృందం మాక్ డ్రిల్