రాష్ట్రీయం

ఒడిశా సమీపంలో ఉపరితల ఆవర్తనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 22: ఒడిశాకు ఆనుకుని సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని దీని ప్రభావంతో ఒడిశా పరిసరాల్లో, కోస్తాంధ్రాలో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ హెచ్చరిక కేంద్రం గురువారం రాత్రి పేర్కొంది. రానున్న 48 గంటల్లో ఇది ఒడిశా వద్ద అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉందని కేంద్రం తెలిపింది. దీనివల్ల సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని తెలియజేసింది. పశ్చిమ దిశగా 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని కేంద్రం వివరించింది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.