రాష్ట్రీయం

సెలక్షన్ పోస్టుల కోసం ఎస్సెస్సీ రిక్రూట్‌మెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: భారత ప్రభుత్వంలో వివిధ మంత్రిత్వశాఖలు, విభాగాలు, సంస్థల కోసం 230 కేటగిరిలకు చెందిన 1351 ఖాళీలల భర్తీకి కంప్యూటర్ ఆధారిత పరీక్ష పద్ధతిలో ఎంపికకు స్ట్ఫా సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత, ప్రమాణాలు, ఇతర నియమనిబంధనలతో కూడిన వివరణాత్మక ప్రకటన, ఇంకా దరఖాస్తు పత్రాలు కమిషన్ వెబ్‌సైట్ ఎస్సెస్సీ డాట్ నిక్ ఇన్ అనే సైట్‌తో పాటు దక్షిణాది రీజినల్ ఆఫీసు వెబ్ సైట్ ఎస్సెస్సీ ఎస్‌ఆర్ డాట్ జీవోవీ డాట్ ఇన్ అనే వెబ్‌సైట్‌లోనూ లభ్యమవుతాయి. ఎస్సెస్సీ రీజనల్ డైరెక్టర్ జారీ చేసిన ప్రకటన ప్రకారం చెన్నైలోని సదరన్ రీజియన్‌కు సంబంధించి 17 కేటగిరిల్లో 67 ఖాళీలున్నాయి. ఎస్సీ, ఎస్టీ , పీడబ్ల్యుడీ , మహిళా అభ్యర్ధులకు రుసుం మినహాయించామని అన్నారు. అర్హులైన అభ్యర్థులు కమిషన్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో ఆగస్టు 31వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన ఎంపిక పరీక్షలు అక్టోబర్ 14 నుండి 18 వరకూ నిర్వహించే అవకాశం ఉందని ఎస్సెస్సీ అధికారులు పేర్కొన్నారు.