రాష్ట్రీయం

‘డ్రోన్’లతో దోమల వేట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 23: మహానగరంలో దోమల విజృంభిస్తున్నాయి. వీటిని అరికట్టేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు కాస్త లేటుగా స్పందించినా, లేటెస్టు టెక్నాలజీతో దోమల నివారణ చర్యలను ప్రారంభించారు. కొన్ని నాలాలు, చెరువుల్లో దోమలు వృద్ధి చెందేందుకు ప్రధాన కారణమైన గుర్రపు డెక్కను తొలగించేందుకు అనుకూలమైన పరిస్థితుల్లేకపోవటంతో డ్రోన్‌ల ద్వారా యాంటీ లార్వా స్ప్రేలను చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు శఉక్రవారం చందానగర్ సర్కిల్‌లో ఈ ప్రక్రియను మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ దాన కిషోర్ ప్రారంభించారు. శేరిలింగంపల్లిలోని గుర్నాధం చెరువులో సుమారు 20 ఎకరాలపై చిలుకు ఉన్న చెరువు పూర్తిగా గుర్రపు డెక్కతో నిండిపోయిందని, తద్వారా దోమలు వృద్ధి చెందుతూ స్థానికులను ఆనారోగ్యం పాలు చేస్తున్నాయంటూ అధికారులు ఫిర్యాదులు అందటంతో మేయర్ రామ్మోహన్, కమిషనర్ దాన కిషోర్ శుక్రవారం అక్కడ డ్రోన్‌లతో దోమల వేటను ప్రారంభించారు. ఈ డ్రోన్ ద్వారా అతి తక్కువ సమయంలోనే చెరువు మొత్తం యాంటీ లార్వా మందును స్ప్రే చేయవచ్చునని తెలిపారు. ఈ మందు ద్వారా చెరువులో ఉన్న గుర్రపు డెక్క విస్తరణకు కూడా అడ్డుకట్ట వేయవచ్చునని వివరించారు. చెరువు మధ్య జీహెచ్‌ఎంసీ సిబ్బంది వెళ్లేందుకు కష్టతరంగా మారటంతో డ్రోన్‌లను వినియోగించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఇప్పటికే శేరిలింగంపల్లి జోన్‌లోని పలు చెరువులు, మూసీ నదిలో కూడా డ్రోన్‌ల సహాయంతో యాంటీ లార్వాను స్ప్రే చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆ తర్వాత ఈ ప్రక్రియను పరిశీలించేందుకు వచ్చిన కమిషనర్ దాన కిషోర్ మాట్లాడుతూ నగరంలో దోమలు వృద్ధి చెందకుండా గుడ్డ దశలోనే దాన్ని నివారించేందుకు అనేక చర్యలు చేపట్టామని వివరించారు. అంతేగాక, దోమల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, ఆ దిశగా వారిని ఆకర్షితులను చేసేందుకు ప్రత్యేకంగా మస్కిటో యాప్‌ను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ యాదగిరిరావు తదితరులు పాల్గొన్నారు.