రాష్ట్రీయం

కోడెలకు తీవ్ర అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 23: ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుంటూరులోని తన నివాసంలో నిద్రకు ఉపక్రమిస్తున్న సమయంలో ఛాతిలో తీవ్రంగా నొప్పి రావడంతో ఆయన బంధువులు గుర్తించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. స్పీకర్ అల్లుడు డాక్టర్ మనోహర్ వెంటనే స్పందించి తన ఆసుపత్రిలోనే ఇనె్టన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్చారు. వెంటిలేటర్ ఏర్పాటు చేసి స్వయంగా కోడెల ఆరోగ్య పరిస్థితి సమీక్షిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా సార్వత్రిక ఎన్నికల నుండి స్పీకర్ కోడెల రాజకీయంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఓ పక్కన ఎన్నికల సంఘటనలు మరోపక్క కుమార్తె, కుమారుడిపై వచ్చిన ఆరోపణలు, నేర పరిశోధక సంస్థల తనిఖీలు ఆయనపై ఒత్తిడిని మరింత పెంచాయి. దీనికి తోడు అసెంబ్లీకి చెందిన ఫర్నిచర్ తరలింపు నేపథ్యంలో ఆయనపై వచ్చిన ఆరోపణలతో మరింత ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇదిలావుండగా గతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో అధికార పక్ష నేతల నుండి ఆరోపణలు, విమర్శలతో ముప్పేట దాడికి గురయిన కోడెలకు మానసిక ఒత్తిడి తీవ్రమయింది. ఈ పరిస్థితుల్లో శుక్రవారం ఆయనపై పెరిగిన మానసిక ఒత్తిడి ఏకంగా ఛాతీనొప్పిగా పరిణమించింది.