రాష్ట్రీయం

వచ్చే వర్షాకాలం నాటికి పాలమూరు ఎత్తిపోతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 23: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసి వచ్చే వర్షాకాలం నాటికి సాగునీరు అందించనున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మాదిరిగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను కూడా రేయింబవుళ్ళు మూడు షిప్టులు పని చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై సీఎం సమీక్ష జరిపారు. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని సగం వ్యవసాయ భూములకు సాగునీటిని అందించవచ్చని, అలాగే మిగతా సగానికి పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా అందించవచ్చాన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మాదిరిగా మూడు షిప్టులు రేయింబవుళ్ళు నిర్మాణ పనులు చేపడితే వచ్చే వర్షాకాలం నాటికి సాగునీటిని అందించగలుగుతామన్నారు. పాలమూరు ఎత్తిపోతల
ప్రాజెక్టులో కొనసాగుతున్న పనులపై, భవిష్యత్‌లో జరగాల్సిన పనులపై నీటిపారుదలశాఖ అధికారులకు సీఎం దిశా నిర్దేశం చేశారు. ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్లు, పంప్ హౌజ్‌లు, కాలువల పనులను సమాంతరంగా చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల్లో వేగం పెంచాలన్నారు. ఈ సమావేశంలో నీటిపారుదలశాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ మురళీధర్‌రావు, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ రమేశ్‌తో పాటు ఇతర ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.