రాష్ట్రీయం

సాగర్ @ 590

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, ఆగస్టు 23: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం సాయంత్రానికి పూర్తిస్థాయికి చేరుకుంది. సాగర్ నీటిమట్టం 590 అడుగులకు చేరుకుంది. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు భారీగా వరద నీరు వచ్చిన కారణంగా పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు చేరకముందే క్రస్టు గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల చేశారు. సాగర్‌కు వస్తున్న ఇన్‌ఫ్లో తగ్గుతుండడంతో డ్యాం గేట్లను పూర్తిగా మూసివేసి సాగర్‌కు వచ్చే నీటితో విద్యుత్ ఉత్పత్తి, కుడి కాల్వ, ఎడమ కాల్వలకు నీటి విడుదల చేస్తూ సాగర్‌లో నీటి మట్టాన్ని పెంచుతూ వచ్చారు. ఈ సంవత్సరం మొదటిసారి నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 590 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం శ్రీశైలం నుండి సాగర్‌కు 53,488 క్యూసెక్కుల నీరు వస్తుండగా కుడి కాల్వ ద్వారా 9302 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 8,022 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 33,456 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2,400 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 300 క్యూసెక్కులను మొత్తంగా 53,483 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం నుండి వచ్చే నీటి పరిమాణాన్ని వచ్చింది వచ్చినట్లుగా కాల్వలకు, విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తూ జలాశయ నీటి మట్టాన్ని 590 అడుగులతో నిలకడగా ఉంచుతున్నారు. శ్రీశైలం నుండి భారీగా ఇన్‌ఫ్లో వస్తేనే సాగర్ డ్యాం గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల చేయనున్నారు. ప్రస్తుతం శ్రీశైలానికి ఎగువ నుండి 22,613 క్యూసెక్కుల నీరు వస్తుండగా 883.70 అడుగులుగా ఉంది.