రాష్ట్రీయం

ఏపీ రాజధానిగా అమరావతినే ఉంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 24: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం అమరావతిలోనే జరగాలని జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రభుత్వాలు మారినపుడల్లా రాజధానులు మార్చుకుంటూ పొతే మన ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించారు. ఇలాంటి అనాలోచిత నిర్ణయాల వల్ల పెట్టుబడులు రాకపోగా, నిరుద్యోగం పెరిగిపోతుందని అన్నారు. ఇది రాజధాని కోసం భూములు ఇచ్చిన 28వేల రైతు కుటుంబాల సమస్య కాదని, యావత్ రాష్ట్ర ప్రజల సమస్యని పేర్కొన్నారు. శనివారం నాడు హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయానికి రాజధాని అమరావతి ప్రాంత రైతులు వచ్చారు. పవన్‌కళ్యాణ్‌తో సమావేశమై తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఒప్పందం ప్రకారం ఈ ఏడాది ఇవ్వాల్సిన కౌలు మొత్తం ఇవ్వలేదని, రాజధాని గురించి మంత్రులు, అధికారపక్ష నేతలు చేస్తున్న ప్రకటనలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొత్త ప్రభుత్వం అమలుచేయాలని, దానిలో ఏమైనా అవకతవకలు ఉంటే సరిదిద్దాలే తప్ప మొత్తానికి రాజధానినే మార్చేస్తాం అంటే ప్రభుత్వం , ప్రభుత్వ విధివిధానాలపై ప్రజలకు నమ్మకం పోతోందని అన్నారు. కొందరు వ్యక్తులకు అధికారం ఇచ్చాక, వారి తీసుకున్న నిర్ణయాలకు మనం బందీలం కావడం సరికాదని అన్నారు. రాష్ట్రం విడగొట్టినాఅ, డీమానిటైజేషన్ అంటూ నిర్ణయం తీసుకున్నా ఒప్పుకుని తీరాల్సిందేనని అన్నారు. వేరే దారిలేదని, అలాగే గత ప్రభుత్వం అమరావతిలో నిర్మాంచాలని నిర్ణయం తీసుకుని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినపుడు మంచో చెడో అందరూ కట్టుబడి ఉన్నారని గుర్తుచేశారు.
మంత్రులు, ప్రజాప్రతినిధులు రైతులకు గందరగోళానికి గురిచేసే ప్రకటనలు చేయరాదని అన్నారు. ఒకసారి రాష్ట్రాన్ని విడగొట్టి రాజధాని లేకుండా చేశారని, మళ్లీ ఇపుడు రాజధాని అమరావతి కాదని, ఇంకో చోట అంటే మన ఉనికే ప్రశ్నార్ధకం అవుతుందని పేర్కొన్నారు. ఇపుడు రాజధాని మారిస్తే అభివృద్ధి కోసం ఇంత కాలం పెట్టిన ఖర్చు ఏం కావాలవని అన్నారు. అభివృద్ధి కోసం వెచ్చించిన డబ్బు మంత్రులు, ముఖ్యమంత్రిదీ కాదని పేర్కొన్నారు. తాను 30, 31 తేదీల్లో పార్టీ నేతలతో కలిసి రాజధాని ప్రాంతంలో పర్యటించి ఎంత అభివృద్ధి జరిగిందో స్వయంగా ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల పోరాటానికి జనసేన పార్టీ అండగా నిలుస్తుందని అన్నారు. మూడు పంటలు పండే భూములకు రైతులు ప్రజలకు ఇచ్చి త్యాగాలు చేశారని, వారి త్యాగాలు వృథా కానివ్వమని అన్నారు.
కలవరపెడుతున్నాయి: రైతులు
అంతకుముందు అమరావతి రైతులు పవన్‌కళ్యాణ్‌తో మాట్లాడుతూ మంత్రుల ప్రకటనలు కలవరపెడుతున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం 29 గ్రామాల రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చామని, 28వేలకు పైగా కుటుంబాలు ఆ భూములు మీదనే ఆధారపడి ఉన్నాయని అన్నారు. ముఖ్యమంత్రి ,గవర్నర్ బంగ్లాలు, అసెంబ్లీ మినహా రాజధానికి సంబంధించిన అన్ని కట్టడాలూ నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయని, ప్రభుత్వం మారిన తర్వాత అభివృద్ధి పనులు మొత్తం నిలిపివేశారని, ఒప్పందం ప్రకారం తమకు ఇవ్వాల్సిన కౌలు కూడా ఇవ్వలేదని అన్నారు. ఇపుడు వరద ముంపు ప్రాంతం అన్న నెపం చూపి బొత్స సత్యనారాయణ లాంటి మంత్రులు చేస్తున్న ప్రకటనలు తమ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉంటున్నాయని అన్నారు. కొండవీటివాగుకు 1903లో వరదలు వచ్చాయని, ఆ తర్వాత మళ్లీ రాలేదని 16వేల క్యూసెక్కులకు మించి వరద ఎన్నడూ రాలేదని అన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఆ విషయాన్ని అంగీకరించిందని చెప్పారు. కృష్ణా నదిలో ఉద్ధేశ్యపూర్వకంగా పరిమితికి మించి నీటిని నిల్వ చేయడం వల్ల లంకల్లోకి మాత్రమే నీరు వచ్చిందని, రాజధాని ప్రాంతం ఉన్న 29 గ్రామాల్లో ఎక్కడా వరద నీరు రాలేదని అన్నారు. రాష్ట్రం బాగుకోసమే భూములు ఇచ్చామని, పార్టీ కోసం కాదని గుర్తుంచుకోవాలని అన్నారు. రైతుల తరఫున మాదాల రాజేంద్ర, ధనేకుల రామారావు, లంకా సుధాకర్, దామినేని శ్రీనివాస్, పోతురాజు శ్రీనివాస్, బెజవాడ నరేంద్ర, పానకాలు గోపాలం, చలపతిరావు తదితరులు సమస్యలను వివరించారు. రైతుల వెంట జనసేన నేతలు గద్దె తిరుపతిరావు, కళ్యాణం శివ శ్రీనివాసరావు తదితరులున్నారు.