రాష్ట్రీయం

నాలుగు రాజధానులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు : ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రాజధానులు ఏర్పాటు చేస్తామన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు. కర్నూలు నగరంలోని తన నివాసంలో ఆదివారం ఎంపీ టీజీ వెంకటేష్ విలేఖరులతో మాట్లాడుతూ అమరావతిపై ఇక ఆశలు వదులుకోవాల్సిందే అన్నారు. ప్రత్యామ్మాయ రాజధానులపై సీఎం వైఎస్ జగన్ బీజేపీ అధిష్టానంతో చర్చించారన్నారు. రాష్ట్రంలోని గుంటూరు, విజయనగరం, కాకినాడ, కడప జిల్లాలను రాజధానులుగా గానీ, ఆర్థిక ప్రణాళిక బోర్డులుగా గానీ చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని బీజేపీ అధిష్టానమే తనకు ఈ విషయం తెలిపిందన్నారు. నవ్యాంధ్రకు ఒకటి కాకుండా నాలుగు రాజధానులు ఉండే అవకాశం ఉందన్నారు. గత ప్రభుత్వం విజయవాడ, గుంటూరు మధ్యలో ఒక అసెంబ్లీ, ఒక సచివాలయం నిర్మించి పాలన కొనసాగించి ఉంటే మంచిదన్నారు. జగన్ పాదయాత్ర సమయంలో అమరావతి భవనాలు వర్షాలకు కూలిపోతాయన్న మాట నిజం అయిందన్నారు. అందుకు తాత్కాలిక భవనాల్లో పరిపాలన సాగిస్తూ రాష్ట్రంలో నాలుగు రాజధానులు ఏర్పాటు చేసి పక్కా భవనాలు నిర్మించే నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నానన్నారు. అమరావతిలో పెట్టుబడులు పెడితే ఉత్తరాంధ్ర, రాయలసీమ విడిపోవడం ఖాయమని, కావున పెట్టుబడుల వికేంద్రీకరణ జరగడం మంచిదన్నారు. గోదావరి నీటిని శ్రీశైలానికి ఇస్తామనడం హాస్యాస్పదం అని ఎద్దేవా చేశారు. రాష్ట్రం ప్రభుత్వం పోలవరం టెండర్ల విషయంలో కేంద్రాన్ని సంప్రదించలేదన్నారు. పోలవరాన్ని సీఎం జగన్ నిర్లక్ష్యం చేస్తే మాజీ సీఎం చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్‌లకు రాజకీయంగా లైఫ్ ఇచ్చిన వారవుతారన్నారు.
చంద్రబాబు కేవలం అమరావతిపై దృష్టి పెట్టటంతో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో సహా లోకేష్ కూడా ఓడిపోయారని ఆయన విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును ఆపడం మంచిది కాదని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. దీనిని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారని, చంద్రబాబు కొనసాగించారని టీజీ పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సీఎం జగన్ ఎంత తక్కువ నమ్మితే ఆయన రాజకీయ జీవితానికి అంత మంచిదని టీజీ స్పష్టం చేశారు.
చిత్రం... బీజేపీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్