రాష్ట్రీయం

‘ప్రైవేటు విద్యా సంస్థలపై చర్యలు చేపట్టాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 18: సెలవుల్లో సైతం తెలంగాణలో కాలేజీలను నడుపుతున్న ప్రైవేటు యాజమాన్యాలపై చర్యలు చేపట్టాలని ఎబివిపి రాష్టక్రార్యదర్శి అయ్యప్ప, భాగ్యనగర కార్యదర్శి దిలిప్, జాతీయ కార్యవర్గ సభ్యుడు రాఘవేందర్, కార్యాలయ కార్యదర్శి ఎ.గిరి ప్రసాద్ కోరారు. ఈ మేరకు తాము ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్‌ను కలిసి ఈ విషయాన్ని వివరించామని వారు పేర్కొన్నారు. ఒకవైపు రాష్ట్రంలో తీవ్ర ఎండల కారణంగా వందలాది మంది చనిపోతుంటే ప్రభుత్వం సెలవులు ఇచ్చిందని, అయతే కార్పొరేట్ విద్యా సంస్థలు కనికరం లేకుండా మండుటెండల్లో కాలేజీలు నడుపుతున్నాయని వారు పేర్కొన్నారు.
ఒక వైపు ఎండ మరోవైపు కాలేజీల్లో తీవ్ర వత్తిడి కారణంగా విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. కొత్తగా ఒక కార్పొరేట్ కాలేజీ వెలిసిందని, దానికి ఏ రకమైన అనుమతి లేదని ఆ కాలేజీ వెనుక ప్రభుత్వంలో ఒక మంత్రి అండ ఉందని తెలిసిందని పేర్కొన్నారు.