రాష్ట్రీయం

ప.గో.లో పోలీసు ఇ-ఆఫీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, నవంబర్ 20: దేశంలోనే తొలిసారిగా పోలీసు విభాగంలో ఇ-ఆఫీసు విభాగాన్ని డిజిపి జెవి రాముడు పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో శుక్రవారం ప్రారంభించారు. ఈ విధానం ద్వారా అన్ని ఫైళ్లు ఆన్‌లైన్‌లో నడుస్తాయని, ఫలితంగా పోలీసు కార్యకలాపాలు వేగంగా, సులభంగా జరుగుతాయన్నారు. ఈ విధానం దేశంలోనే తొలిసారిగా పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రవేశపెట్టామని, రానున్న రోజుల్లో మరింతగా విస్తరిస్తామని తెలిపారు. ఈ సందర్భంగానే ఆయన ఇ-చలానా విధానాన్ని కూడా ప్రారంభించారు. శుక్రవారం జిల్లా కేంద్రం ఏలూరులో పర్యటించిన డిజిపి పోలీసులకు సంబంధించి వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. అంతకుముందు జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గాల్సిన అవసరం ఉందన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో కలిసిన కుకునూరు, వేలేరుపాడు మండలాలకు సంబంధించి సిబ్బంది నియామకాల్లో సర్దుబాటుకు కొంత సమయం పడుతుందన్నారు. వాస్తవానికి అధికారుల విభజన పూర్తిస్థాయిలో జరిగేంతవరకు అయా ప్రాంతాల నుంచి సిబ్బందిని, అధికారులను ఉపసంహరించకూడదని, అయినప్పటికీ అక్కడి పోలీసు సిబ్బంది వెనక్కి వెళ్లిపోయారని చెప్పారు. పోలీసు శాఖలో ఖాళీల భర్తీకి ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, త్వరలోనే అనుమతి రావచ్చునన్నారు. కాగా మావోయిస్టుల కదలికల నేపధ్యంలో రాష్ట్రం అప్రమత్తంగానే ఉందని, వారికి అవకాశం ఇవ్వకుండా చూడటానికి అన్నివిధాలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. హోంగార్డుల వేతనాలు పెంచాలని ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదించామని తెలిపారు. ప్రతి జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రుల వద్ద ఫోరెన్సిక్ ల్యాబ్‌లను ఏర్పాటుచేస్తేనే మంచి ఫలితాలు ఉంటాయని, ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు వివరించారు. చిత్తూరు మేయర్ కఠారి అనురాధ హత్య కేసులో సికె బాబుపై అనుమానాలు ఉన్న మాట వాస్తవమేనని, అయితే ప్రస్తుతానికి దానికి సంబంధించి ఆధారాలు ఏమిలేవని డిజిపి పేర్కొన్నారు. సురేష్‌చంద్ర బహుగుణ పోలీసు స్కూల్‌లో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించారు. జిల్లాలో శాంతిభద్రతలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో కోస్తా జిల్లాల ఐజి విశ్వజిత్, ఏలూరు రేంజ్ డిఐజి హరికుమార్, జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ తదితరులు పాల్గొన్నారు.

ఏలూరులో పోలీసు ఇ-ఆఫీసు ప్రారంభింస్తున్న డిజిపి రాముడు