రాష్ట్రీయం

బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/తార్నాక/ నాచారం, డిసెంబర్ 8: ఓయులో బీఫ్ ఫెస్టివల్‌కు గడువు దగ్గర పడుతున్నకొద్దీ క్యాంపస్‌లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంటోంది. కోర్టు యధావిధి పరిస్థితి కొనసాగించాలని ఆదేశించినా, పోలీసులు అనుమతులు లేవని ఇప్పటికే స్పష్టం చేసినా విద్యార్థులు మాత్రం తాము బీఫ్ ఫెస్టివల్ నిర్వహించి తీరుతామని అంటున్నారు. మంగళవారం ఓయు ఆర్ట్స్ కళాశాల వద్ద ఓ వర్గం విద్యార్థులు విలేఖరుల సమావేశం నిర్వహించి తమ గిరిజన సాంప్రదాయాలకు ప్రతీకగా పోర్క్ ఫెస్టివల్ (పందిమాంసం విందు)ను నిర్వహించి తీరుతామని పేర్కొన్నారు. కోర్టు చెప్పినట్లు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తమ కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు.
ఇందుకోసం అన్ని పార్టీల నేతలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించామని, వారు తప్పకుండా హాజరవుతామని హామీ ఇచ్చారని తెలిపారు.
ఇదిలా ఉండగా ‘్భఫ్ పెస్టివల్’ నిర్వాహకులు మంగళవారం ఎన్‌ఆర్‌ఎస్‌హెచ్ హాస్టల్ వద్ద 10వ తేది నిర్వహించనున్న బీఫ్ పెస్టివల్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం బీఫ్‌తో తయారుచేసే రకరకాల వంటకాలను వండి తీసుకువచ్చి ప్రదర్శించి అనంతరం భుజించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోర్టు తీర్పుకు సంబంధించి తమకు ఎలాంటి కోర్టు తీర్పు కాపీలు, అదేవిధంగా అధికారుల ఆదేశాలు అందలేదని వివరించారు. ఈ నెల 10న మానవహక్కుల దినోత్సవం రోజు తమకు ఇష్టమైన ఆహారాన్ని వండుకుని తింటామని తెలిపారు. కాగా ఔటా అధ్యాపకులు నిర్వహించిన విలేఖరుల సమావేశంపై స్పందిస్తూ ఎకడమిక్ వాతావరణాన్ని కాపాడడానికి సదరు అధ్యాపకులు ఏమి చేశారో వివరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుదర్శన్, డేవిడ్, ముజపర్, స్టాలిన్, శ్రీనివాస్‌గౌడ్, బద్రి, రాజేందర్, ముఖేశ్ తదితరులు పాల్గొన్నారు.
‘చదువులపైనే దృష్టి పెట్టాలి’
ఓయులో విద్యార్థులు తమ దృష్టిని చదువులపైనే పెట్టాలని ‘ఔటా’ అధ్యక్షుడు ప్రొ. సత్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం ఓయులో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులు అకడమిక్ వాతావరణాన్ని పాడుచేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. కోర్టు కూడా ఎలాంటి ఉత్సవాలు నిర్వహించవద్దని ఉత్తర్వులు ఇచ్చిందని, అదేవిధంగా విద్యార్థులు విద్యపై శ్రద్ధ వహించాలని సూచించారు. కొంతమంది రిటైర్డ్ ప్రొఫెసర్లు, పరిశోధన విద్య పేరిట ఓయులో తిష్టవేసిన విద్యార్థులు కలిసి విద్యార్థులను రెచ్చగొడుతున్నారని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ రాములు, లక్ష్మీకాంతం రాథోడ్, డాక్టర్.సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.