రాష్ట్రీయం

మట్టి గణపతే.... మన దళపతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్వకుర్తి, ఆగస్టు 31: వినాయక చవితి పండుగ వస్తుందంటే జిల్లాలో సంబరం అంబరాన్ని తాకుతుంది. వీధి వీధిన కొలువు తీరే విగ్రహాలు, విద్యుత్ వెలుగులతో జిల్లా కొత్త శోభను సంతరించుకుంటుంది. ఈ సంబరాల వెనుక ప్రకృతి, పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని మాత్రం ఎవరూ గుర్తించడం లేదు. రసాయన విగ్రహాలను ప్రతిష్టించడంతో పర్యావరణాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నామన్న విషయాన్ని మర్చిపోతున్నారు. పీఓపీ, రసాయనాలతో రూపొందించిన విగ్రహాలను వాదొద్దని చెప్పేవారు సైతం పండుగ సమయంలో తప్ప ఆ తర్వాత పట్టించుకునే దిక్కులేదు. దీంతో పీఓపీతో తయారు చేసిన విగ్రహాలను వాదొద్దని తెలిసినా తప్పనిసరై ప్రజలు వాటినే కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలోని కొన్ని స్వచ్చంధ సంస్థలు, ప్రైవైట్ పాఠశాలలు వీటి కారణంగా తలెత్తే సమస్యలను వివరించినా ప్రత్యామ్నాయ మార్గం లేక ప్రజలు రసాయన విగ్రహాల వాడకంపైనే మొగ్గుచూపుతున్నారు. ఈ విషయమై దేశవ్యాప్తంగా గత కొనే్నళ్లుగా విస్తృత ప్రచారం జరుగుతున్నా.. ఇప్పటీకీ వినాయక చవితి ఉత్సవాల్లో ఎక్కువగా ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన విగ్రహాలనే వాడుతున్నాం. ఈ విగ్రహాలను జలవనరుల్లో నిమజ్ఞనం చేయడం వల్ల ఈ హానికర రసాయనాలు అందులో కలిసి మానవాళికి, జంతుజాలానికి కూడా హాని కలిగిస్తున్నాయి. విగ్రహాల అలంకరణకు ప్లాస్టిక్, ధర్మాకోల్ వాడటంతో అవి నీటిలో కరగక కాలుష్యాన్ని పెంచుతున్నాయి. ఇలా విషపూరితంగా తయారయ్యే జలవనరుల్లో నీటిన చుట్టుపక్కల ప్రజలు వినియోగించి వ్యాధుల బారిన పడుతున్నారు. కొన్నిసార్లు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో ప్రమాదం
వినాయక విగ్రహాల తయారీకి వాడే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నీటిలో కరగదు. మట్టిలో కలువదు, ఎండకు ఆవిరి కాదు. దీనికితోడు ఇందులో ముడిపదార్థంగా జిప్సమ్ కలుపుతారు. విగ్రహాల్లోవాడే హానికర రసాయనాల వల్ల డయేరియా, చర్మ వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. విగ్రహాల్లో వాడే తగరం వల్ల చర్మ సంబంధ వ్యాధులతో పాటు శరీర రంగు మారుతుంది. అర్సెనిక్ అనే పదార్థం వల్ల తల వెంట్రుకలు రాలిపోతాయి. సీసం కూడా వినియోగించడం వల్ల కడుపులో నొప్పి వస్తుంది. శరీర పటుత్వం తగ్గుతుంది. ఇవన్నీ విగ్రహాలు నిమజ్ఞనం చేసిన నీటిని వినియోగించడం వల్ల వ్యాప్తి చెందుతాయని శాస్తవ్రేత్తలు పేర్కొంటున్నారు.
మట్టి విగ్రహాలతో మేలు
చవితి పూజ దగ్గరపడటంతో విగ్రహాల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. విగ్రహాలను మట్టితో తయారు చేస్తే ఎటువంటి ముప్పు ఉండదు. నిమజ్ఞనం చేయగానే అవి నీటిలో సులువుగా కరిగిపోతాయి. ప్రస్తుతం అలాంటి విగ్రహాలు చాలా తక్కువగా తయారవుతున్నాయి. సిమెంట్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, పింగాణి మట్టితో తయారు చేస్తున్న విగ్రహాలు తొందరగా నీటిలో కరగవు. అలాగే ఫ్లోర్‌సెంట్ రసాయన వ్యర్థాలు బొమ్మలకు పూయడం వల్ల నిమజ్ఞనం చేసినప్పుడు నీటి కాలుష్యం ఏర్పడుతుంది.
ఉత్సవ కమిటీలు భారీ విగ్రహాలను ఏర్పాటు చేసి ఒకే చోటు నిమజ్ఞనం చేస్తారు. దీనివల్ల పూడికలు పెరిగిపోతాయి. అందుకే మట్టితో తయారైన విగ్రమాలను పూజించమని పలు సేవా, స్వచ్ఛంద సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. వాతావరణానికి హాని కలిగించని, నీటిలో కరిగే రంగుల్ని మాత్రమే ఉపయోగించిన మట్టి విగ్రహాలనే పూజిద్దాం.