రాష్ట్రీయం

ఓనం పండుగ కోసం ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 31: కేరళలో ఓనం పండుగను దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ఈ రైళ్లు సికింద్రాబాద్, నిజామాబాద్‌ల నుంచి కేరళ కొచ్చివేలికి ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్- కొచ్చివేలి (07119- 07120)కి సెప్టెంబర్ 8న, కొచ్చివేలి- సికింద్రాబాద్‌కు సెప్టెంబర్ 13వ తేదీన రైలును నడుపుతారు. నిజామాబాద్- ఎన్నాకుళం మధ్య ( 07505- 07504) సెప్టెంబర్ 8న, ఎన్నాకుళం- నిజామాబాద్‌కు 13న ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్- కొచ్చివేలి వెళ్లే రైలు వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు, గూడూరు, రేణిగుంట, కాట్‌పాడి, సేలం, కొయంబత్తూరు, ఎర్నాకుళం, చంగనూర్, కొల్లాం మీదుగా కొచ్చివేల చేరుకుంటుంది. నిజామాబాద్- ఎర్నాకుళం వెళ్లే రైలు కామారెడ్డి, కాచిగూడ, కర్నూల్, గుత్తి, తాడిపత్రి, కడప, రేణిగుంట, కాట్‌పాడీ, ఈరోడ్డ్, కొయంబత్తూరు. ఆల్వా మీదుగా ఎర్నాకుళం చేరుకుంటుంది.