రాష్ట్రీయం

విద్యుత్ రంగంలో అవకతవకలు నిరూపిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 31: విద్యుత్ రంగంలో అవకతవకలను నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని, విద్యుత్ కొనుగోళ్లకు రూ.74వేల కోట్ల అప్పు చేశారని, ఈ భారం ప్రజలపై పడుతోందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, విద్యుత్ సంస్థలను దివాలా తీయించి దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యుత్ సంస్థల యాజమాన్యాలు కారణమన్నారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ సంస్థలకు సీనియర్ ఐఎఎస్‌లను సీఎండీలుగా నియమించేవారన్నారు. అందులో భాగంగానే నాన్ ఐఎఎస్‌లను నియమించారన్నారు. 2014 నుంచి విద్యుత్ సంస్థలు ఇంతవరకు రూ.74వేల కోట్ల అప్పు చేశాయన్నారు. కేవలం రూ.35 కోట్లను మాత్రమే అప్పు తెచ్చామని తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో యాజమాన్యం పేర్కొనడం తప్పన్నారు. అవాస్తవాలతో కూడిన ప్రకటనలు చేయడం సరికాదన్నారు. చిత్తశుద్ధి ఉంటే దీనిపై విద్యుత్ సంస్థల యాజమాన్యం వివరాలను ఇవ్వాలన్నారు. తక్కువ ధరకు విద్యుత్ తెచ్చి వినియోగదారులకు సరఫరా చేయాలన్నారు. తెలంగాణ డిస్కాంలు యూనిట్ విద్యుత్‌ను రూ.7.10పైసలకు సరఫరా చేస్తామంటే దక్షిణ మధ్య రైల్వే తప్పుబడుతూ లేఖ రాసిందన్నారు. ప్రభుత్వ ఆధీనంలోని సంస్థల విద్యుత్ ఉత్పత్తి 80 శాతం నుంచి 69 శాతానికి ఎందుకు పడిపోయిందన్నారు. కరెన్సీ కట్టల కోసం కేసీఆర్ విద్యుత్ సెంటిమెంట్‌ను వాడుకుంటున్నారన్నారు. ప్రభాకరరావును సీఎండీగా నియమించేందుకు అర్హత లేదన్నారు. సమర్థులైన ఐఎఎస్ అధికారులు విద్యుత్ సంస్థల్లో పనిచేయలేకపోతున్నారన్నారు. తప్పుడు నిర్ణయాల వల్ల నష్టం జరుగుతుంటై ప్రశ్నించవద్దంటున్నారన్నారు. విద్యుత్ ఉద్యోగ సంఘాల నేతల వ్యవహారశైలి తనకు తెలుసన్నారు. ఉద్యోగులు సంయమనం పాటించాలన్నారు. ప్రభుత్వ తప్పిదాలను బయటపెడుతున్నారని విద్యుత్ జేఏసీ నేత రఘు మాట్లాడకుండా ఆంక్షలు పెట్టారన్నారు. టీఆర్‌ఎస్‌పైన విమర్శలు చేసే విషయమై బీజేపీలో అంతర్గతపోరు జరుగుతోందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విద్యుత్ ఒప్పందాలను విమర్శిస్తుంటే, అదే పార్టీలో మరో సీనియర్ నేతలు టీఆర్‌ఎస్‌కు వంత పాడుతున్నట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. బీజేపీకి ప్రభుత్వంపై పోరుపై ఒక స్పష్టత లేదన్నారు. వారిలో వారికి అంతర్గత విబేధాలు ఉన్నాయన్నారు. కేసీఆర్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా బీజేపీ చీలిపోయిందన్నారు. కేసీఆర్‌ను వ్యతిరేకించే వారికి బీజేపీలో స్థానం లేదన్నారు.
చిత్రం... విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి