రాష్ట్రీయం

సుశీలకు కొప్పరపు కవుల జాతీయ ప్రతిభా పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (ఆరిలోవ), సెప్టెంబర్ 9: కొప్పురపు కవుల కళాపీఠం ఆధ్వర్యంలో సోమవారం కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించిన జాతీయ ప్రతిభా పురస్కార సభలో ప్రఖ్యాత సినీ నేపధ్య గాయనీ, గానకోకిల పీ.సుశీలకు కొప్పరపు కవుల జాతీయ పురస్కారంతో రాష్ట్ర సాంస్కృతిక శాఖామంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అతిథులు సత్కరించారు. ఇదే వేదికపై డాక్టర్ ఆశావాది ప్రకాశరావును కొప్పరపు కవుల స్మారక అవధాన పురస్కారంతో సత్కరించారు. అనంతరం అతిథులు కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్దేశ్వరానంద భారతీయ స్వామీజీకి పాద పూజ (గురుపూజాత్సవం) నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అనుగ్రహభాషణం చేస్తూ కొప్పరపు కవులు గంటకు 300 పద్యాలు అతి వేగంగా చెప్పగలిగిన ప్రతిభా సంపన్నులని తెలిపారు. ఈ సందర్భంగా సన్మానగ్రహీతలు గానకోకిల సుశీలకు ఆశావాది ప్రకాశరావుకు ఆశీస్సులు అందజేశారు. ఆశుకవి, అవధాని డాక్టర్ దూళిపాళ మహాదేవమణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రితోపాటు అధికార భాషా సంఘం అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, బీజెపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీ.మురళీధరరావు, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, వీఎంఆర్‌డిఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు, మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ ప్రముఖ పాత్రికేయులు డాక్టర్ కే.రామచంద్రమూర్తి, సుప్రసిద్ధ ఆర్ధిక రంగనిపుణులు కే.నరసింహమూర్తి, పైడా విద్యాసంస్థల అధినేత పైడా కృష్ణప్రసాద్, డాక్టర్ కూటికుప్పల సూర్యారావు, మాశర్మ పాల్గొన్నారు. ముందుగా కళాకారులు ఆలమూరి రాధాకుమారి, ప్రఖ్యాత టీవీ యాంకర్, జర్నలిస్ట్ స్వప్న, నారాయణ తీర్థుల తరంగ గానం చేశారు.

చిత్రం...గాన కోకిల పి.సుశీలకు కొప్పరపు కవుల జాతీయ ప్రతిభా పురస్కారాన్ని అందజేస్తున్న దృశ్యం