రాష్ట్రీయం

మళ్లీ తెరుచుకున్న నాగార్జున సాగర్ గేట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ/నాగార్జున సాగర్ : నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు మళ్లీ తెరుచుకున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు నుండి భారీగా వరద ఉదృతి సాగర్ జలాశయంకు చేరుతుండటంతో సాగర్ ప్రాజెక్టు మొత్తం 26క్రస్ట్ గేట్లకుగాను సోమవారం రాత్రి 7:30గంటలకు ఎనిమిది గేట్లను ఐదు అడుగుల మేరకు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం పూర్తి నీటి మట్టం 590అడుగులు, 312టీఎంసీలకుగాను 588.10అడుగులు, 306.39టీఎంసీలుగా కొనసాగుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు నాలుగు గేట్ల నుండి, పవర్ హౌజ్ నుండి సాగర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1లక్ష 84వేల 313క్యూసెక్కుల వరద చేరుతుండగా సాగర్ నుండి అవుట్ ఫ్లో కుడి, ఎడమకాలువ, పవర్ హౌజ్, గేట్ల ద్వారా కలిపి 1లక్ష 14వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885అడులు, 215టీఎంసీలకుగాను 584.60అడుగులు, 213.40టీఎంసీలుగా ఉండగా, ఇన్‌ఫ్లో 3లక్షల 70వేల 781క్యూసెక్కులుగా కొనసాగుతుంది. శ్రీశైలం నుండి నాగార్జున సాగర్‌కు రెండు మూడు రోజుల పాటు వరద ఉదృతి కొనసాగనున్నందునా సాగర్ ప్రాజెక్టు మరిన్ని గేట్లు ఎత్తే విషయమై నేడు మంగళవారం ఉదయం వరద ఉదృతిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని ప్రాజెక్టు ఎస్‌ఈ ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు.
సాగర్ నుండి దిగువకు నీటి విడుదల విషయమై ముందస్తు నది పరివాహక ప్రాంత ప్రజలను, మత్స్యకారులను అప్రమత్తం చేశామన్నారు. గత నెలలో 12వ తేది నుండి 19వ తేది వరకు ఎనిమిది రోజుల పాటు సాగర్ ప్రాజెక్టు మొత్తం 26క్రస్ట్‌గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. మళ్లీ సాగర్ ప్రాజెక్టు గేట్టు తెరుచుకోవడంతో మరోసారి ప్రాజెక్టు వద్ధకు సందర్శకుల తాకిడి పెరుగనుంది.
మరోవైపు పులిచింతల ప్రాజెక్టుకు వరద ఉదృతి పెరుగడంతో ప్రాజెక్టు నుండి దిగువకు మూడుగేట్ల నుండి నీటి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 45.77టీఎంసీలు, 175అడుగులకును 44.500టీఎంసీలు, 174.40అడుగులుగా ఉంది. సాగర్ క్రస్ట్‌గేట్ల నుండి విడుదలవుతున్న వరద నేటి ఉదయంకల్లా పులిచింతల జలాశయంలోకి చేరనుండటంతో ఈ ప్రాజెక్టు మరిన్ని గేట్లు నేడు మంగళవారం ఎత్తే అవకాశముంది.
చిత్రం...సోమవారం రాత్రి నాగార్జున సాగర్ ఎనిమిది క్రస్ట్‌గేట్లను ఎత్తడంతో
దిగువకు పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ