రాష్ట్రీయం

స్వర నాడికి శస్తచ్రికిత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 10: ప్రపంచ వైద్యరంగ చరిత్రలో నూతన శస్తచ్రికిత్స విధానాన్ని కనుగొన్నారు గుంటూరు శ్రీ సత్యసాయి ఫణీంద్రకుమార్ ఈఎన్‌టీ రీసెర్చ్‌సెంటర్ నిర్వాహకులు డాక్టర్ ఫణీంద్రకుమార్. ప్రపంచ వ్యాప్తంగా స్వర సమస్యలలో తలెత్తే రెండు స్వరనాడుల పక్షవాతంతో ఇబ్బంది పడే రోగులకు నూతన చికిత్స విధానాన్ని కనుగొన్నట్లు డాక్టర్ ఫణీంద్రకుమార్ తెలిపారు. మంగళవారం నగరంలోని ఓ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. సాధారణంగా పుట్టుకతో స్వర సమస్యలతో బాధపడే వారిలో స్వరం కోల్పోయి ఊపిరి అందక ప్రాణాపాయస్థితికి చేరుకునే ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్నారు. ఇలాంటి వారి కోసం ఎవేక్ లేసర్ కార్టటమీ అనే నూతన చికిత్స విధానం ద్వారా చికిత్సను అందించామన్నారు. ఇటువంటి శస్తచ్రికిత్సను ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరూ వాడుకలోకి తీసుకురాలేదని వివరించారు. మొట్టమొదటి సారిగా గుంటూరులో గత 6 సంవత్సరాలుగా వేలాది మంది రోగులను పరీక్షించి వారికి అత్యంత విజయవంతంగా నూతన చికిత్స విధానం ద్వారా శస్తచ్రికిత్సలు నిర్వహించామని ఆయన వెల్లడించారు.
తాము కనుగొన్న నూతన శస్తచ్రికిత్స విధానం గురించి తెలుసుకున్న అమెరికాలో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ స్వర నిపుణుల సమావేశం నిర్వాహకులు తనకు ఆహ్వానం పంపించారన్నారు. ఈ నెల 17న అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానన్నారు. ఆసియా ఖండం మొత్తంలో తనకే ఆహ్వానం అందిందని డాక్టర్ ఫణీంద్ర కుమర్ తెలిపారు. స్వర సమస్యలతో సతమతమయ్యే వారిలో ఎక్కువగా స్వర పేటికలోని స్వరనాడులు ప్రకంపనలకు లోనయినప్పుడు స్వరం ఏర్పడటానికి, ఊపిరితిత్తులలో గాలి వెళ్లడం ఎంతో అవసరమని కొన్ని సందర్భాల్లో రెండు స్వరనాడులలో ఒకటి గాని, రెండు స్వరనాడులు గానీ పక్షవాతానికి లోనయ్యే ప్రమాదం ఉంటుందన్నారు. ఇలా స్వరనాడులు పక్షవాతానికి లోనవడానికి ప్రధాన కారణం థైరాయిడ్ ఆపరేషన్లని, వైరల్ ఇన్‌ఫెక్షన్ వల్ల ఎక్కువ మంది వ్యాధికి గురవుతున్నారని ఆయన తెలిపారు. ఏక స్వరనాడి పక్షవాతానికి లోనైనప్పుడు స్వరం కోల్పోయి బొంగురుగొంతు ఏర్పడుతుందని, రెండు స్వరనాడులు పక్షవాతానికి గురైతే రోగికి ఊపిరి అందక ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. గతంలో ఇలాంటి రోగులకు ట్రకియాష్టమా (మెదడు వద్ద ఊపిరి ఆడటానికి గొట్టం ఏర్పాటు చేయడం) అనే చికిత్స మాత్రమే అందుబాటులో ఉండేదని, తాము ఆరేళ్లలో విస్తృత పరిశోధన చేసి 40 మంది రోగులకు విజయవంతంగా ఎవేక్ లేసర్ కార్టటమీ చికిత్సా విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.