రాష్ట్రీయం

శ్రీశైలానికి తగ్గిన వరద ప్రవాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం టౌన్, సెప్టెంబర్ 11: ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం తగ్గింది. బుధవారం సాయంత్రం 5 గంటల సమయానికి జూరాల, తుంగభద్ర నదుల ద్వారా 2,00,177 క్యూసెక్కుల వరద నీరు వచ్చి శ్రీశైలానికి చేరింది. వరద తగ్గుముఖం పట్టడంతో ఆరు గేట్ల ఎత్తును 10 అడుగులు తగ్గించారు. జలాశయంలో నీరు పుష్కలంగా ఉండడంతో ఆంధ్రా ప్రాంతంలోని కుడిగట్టు జల విద్యుత్ కేంద్రం, తెలంగాణ ప్రాంతంలోని ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. జలాశయం ఆరు గేట్ల ద్వారా 2,02,896 క్యూసెక్కుల నీరు సాగర్‌కు విడుదల అవుతోంది. అదే విధంగా రెండు విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి అనంతరం 68,206 క్యూసెక్కుల నీరు సాగర్‌కు పంపుతున్నారు. జలాశయం బ్యాక్‌వాటర్ ద్వారా కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2,400 క్యూసెక్కులు, హంద్రీనీవాకు 2,026 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 28,500 క్యూసెక్కుల నీటని విడుదల చేస్తున్నారు. మొత్తంగా శ్రీశైలం జలాశయం నుంచి 3,04,028 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది. ప్రస్తుతం డ్యాం నీటిమట్టం 884.60 అడుగులు ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 213.4011 టీఎంసీలుగా నమోదైంది.