రాష్ట్రీయం

బుద్ధికి, శక్తికి ప్రతిరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 12: దేవతలే పూజించే ఆది దేవుడు వినాయకుడు బుద్ధి, శక్తికి ప్రతిరూపమని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. వినాయక చతుర్ధి ప్రపంచంలోనే అతి పెద్ద పండుగ అని వ్యాఖ్యానించారు. గణేష్ నిమజ్జనాన్ని పురస్కరించుకుని ఆయన గురువారం హైదరాబాద్ పాతబస్తీలోని శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్నారు. ఎం.జే.మార్కెట్ చౌరస్తాలో భాగ్యనగర ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన స్వాగత వేదికపై నుంచి ఆయన భక్తులనుద్దేశించి ప్రసంగిస్తూ విభిన్న మతాలు, కులాలకు చెందిన ప్రజలు కలిసిమెలిసి జీవించే భారతదేశం ఒక గొప్ప సమాజమని, మనందరం ఎలాంటి భావోద్వేగాలకు గురి కాకుండా ఐక్యంగా ముందుకెళ్లాల్సిన అవసరముందని అన్నారు. వినాయకుడికి ఫలం, పత్రం, ఉదకం సమర్పించి పూజలు చేసే మనం మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుకోవాలని, గణనాధుడ్ని స్మరిస్తే కొర్కెలు నెరవేరుతాయని అన్నారు. భారతమాత రక్షణ కోసం మనందరం ఐక్యంగా ఉండాల్సిన అవసరముందని సూచించారు. మొత్తం జగత్తుకే గణేషుడు దేవుడని, ఆయన మనకు మంచి బుద్ధిని, శక్తిని ప్రసాదించేందుకు ప్రతి సంవత్సరం పదిరోజుల పాటు మన మధ్య ఉండేందుకు రావటమే వినాయక చతుర్ధి అని అభివర్ణించారు. పూర్వజన్మ సుకృతంతో సిద్ధించిన శక్తి, బుద్ధి ఇతరులకు ఇబ్బందులు కల్గించేలా ఉండరాదని, దాన్ని బాధితులు, పీడితులకు సేవ చేసేందుకు వినియోగించాలని సూచించారు.
పదకొండు రోజుల పాటు మన మధ్యనే ఉంటూ, మన పూజలందుకునే గణనాధుడు నిమజ్జనం తర్వాత లోక కల్యాణార్థం ఇతర లోకాలకు తరలి వెళ్తారని వివరించారు. హరిద్వార్ పీఠాధిపతి ప్రజ్ఞానంద్ మాట్లాడుతూ అన్ని పండుగల్లో వినాయక చవితి ఎంతో గొప్పదని, కలిసిమెలిసి ఐకమత్యంతో జరుపుకోవాలని సూచించారు. మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో జీవించాలని వినాయకుడ్ని కోరుకున్నట్లు తెలిపారు.
*చిత్రం... అశేష భక్తజనంతో విశేష పూజలందుకుని నిమజ్జనానికి తరలుతున్న ఖైరతాబాద్ గణనాథుడు... నిమజ్జనోత్సవం సందర్భంగా కిటకిటలాడిన భాగ్యనగర పురవీధులు... (ఇన్‌సెట్‌లో) హుస్సేన్‌సాగర్ జలాల్లో కలుస్తున్న భారీ గణపతి...