రాష్ట్రీయం

బాలాపూర్ లడ్డూ రూ.17.60 లక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : బాలాపూర్ లడ్డూ ఈసారి 17,60,000 రూపాయల ధర పలికింది. బాలాపూర్ గ్రామానికే చెందిన రైతు కొలను రాంరెడ్డి వేలంలో లడ్డూను దక్కించుకున్నారు. మొత్తం 12 మంది లడ్డూ వేలంలో పాల్గొనగా, వేలం రసవత్తరంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే అయిన పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి, రంగారెడ్డి జిల్లా ప్రజాపరిషత్ చైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేలం పాటకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. 1994 సంవత్సరంలో మొదటిసారి బాలాపూర్ లడ్డూ వేలం ప్రారంభమైంది. మొట్టమొదటి సారి కొలను మోహన్‌రెడ్డి అనే రైతు 450 రూపాయలకు దక్కించుకున్నారు. మోహన్‌రెడ్డి కుమారుడైన రాంరెడ్డి తాజాగా ఈరోజు లడ్డూను వేలంలో దక్కించుకున్నారు. 1994 నుండి ఇప్పటి వరకు 26 సార్లు లడ్డూ వేలం జరగగా, కొలను కుటుంబ సభ్యులు తొమ్మిది సార్లు లడ్డూను దక్కించుకున్నారు. 2011 లో కొలను సోదరులు 5,45,000 రూపాయలకు లడ్డూను వేలంలో కొనుగోలు చేయగా, ఆ తర్వాత ఏడు సంవత్సరాల తర్వాత మళ్లీ కొలను కుటుంబ సభ్యులు లడ్డూను వేలంలో దక్కించుకున్నారు. బాలాపూర్ లడ్డూకు గొప్ప కథ ఉంది. 2013 లో తీగల కృష్ణారెడ్డి ఈ లడ్డూను వేలంలో 9,26,000 రూపాయలకు దక్కించుకోగా, ఆ మరుసటి సంవత్సరం వినాయక చవితి కంటే ముందే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత సంవత్సరం ఈ లడ్డూను 16,60,000 రూపాయలకు బాలాపూర్ మండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తేరెటిపల్లి శ్రీనివాస్‌గుప్తా దక్కించుకున్నారు. ఈ సంవత్సరం సరిగ్గాఒక లక్ష రూపాయలు అదనంగా అంటే 17,60,000 రూపాయలు పలికింది.
హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రం మొత్తంలో బాలాపూర్ లడ్డూ అత్యధిక ధరకు వేలంలో పోతోంది.
లడ్డూ వేలం ద్వారా వస్తున్న డబ్బును బాలాపూర్ గ్రామంలో ఆలయాలు తదితర అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. హనుమాన్ మందిరం, లక్ష్మీగణపతి ఆలయం, ఉన్నత పాఠశాల, వేణుగోపాల స్వామి ఆలయం, పోచమ్మ దేవాలయం, శివాలయం అభివృద్ధి, మహంకాళి మందిర నిర్మాణం, మల్లన్న మందిర తదితరాలకు వినియోగించారు. ఈ పర్యాయం హైదరాబాద్‌లోని ఫిలింనగర్ ప్రాంతంలో ఉన్న వినాయక నగర్ గణేశుడి లడ్డూ 17,75,000 రూపాయలకు బీజేపీ నాయకుడు పల్లపు గోవర్దన్ పాడారు. ఈ గణేశుడి లడ్డూనే గత ఏడాది కూడా గోవర్దన్ 15,01,116 రూపాయలకు దక్కించుకున్నారు.