రాష్ట్రీయం

ఘనంగా రొట్టెల పండగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, సెప్టెంబర్ 12: మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే నెల్లూరులోని బారాషహిద్ దర్గాలో రొట్టెల పండగ భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈనెల 10 నుండి ప్రారంభమైన ఈ పండగకు రోజురోజుకీ భక్తుల తాడికి పెరుగుతోంది. పండుగలో మూడోరోజు అత్యంత ప్రధానం కావడంతో గురువారం లక్షల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఉత్సవాల్లో అత్యంత ముఖ్యమైన గంధ మహోత్సవం బుధవారం అర్ధరాత్రి ఘనంగా నిర్వహించారు. 12 బిందెలతో గంధాన్ని మేళతాళాలు, ఫకీర్ల ప్రత్యేక ప్రార్ధనల నడుమ దర్గాకు తీసుకొచ్చారు. అనంతరం కడప దర్గా పీఠాధిపతి నేతృత్వంలో దర్గాలోని 12 మంది వీరుల సమాధులకు పరిమళాలు కలిపిన గంధాన్ని లేపనం చేశారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుండి విచ్చేసి రాత్రంతా మేల్కొని ఉండడం విశేషం. లేపనం అనంతరం పూజలు నిర్వహించిన గంధాన్ని భక్తులకు పంచిపెట్టారు. ఈ గంధం కోసం భక్తులు పోటీ పడ్డారు. అనంతరం మిగిలిన గంధాన్ని స్వర్ణాల చెరువులో కలిపారు. పూజల అనంతరం స్వర్ణాల చెరువులో గంధాన్ని కలపగా ఆ చెరువు నీటిలో నిలబడి రొట్టెలు మార్చుకుంటే తమ కోర్కెలు నెరవేరతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసం. దీంతో గంధ మహోత్సవం అనంతరం ఇక్కడకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. గురువారం కూడా సుమారు 3 లక్షల మంది వరకూ భక్తులు వివిధ ప్రాంతాల నుండి ఇక్కడకు విచ్చేసి స్వర్ణాల చెరువులో నిలబడి తమ కోర్కెల రొట్టెలను పట్టుకున్నారు.
దర్గాను సందర్శించిన డిప్యూటీ సీఎం
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా గురువారం బారాషహీద్ దర్గాను సందర్శించారు. అనంతరం అక్కడ జరిగిన ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొని స్వర్ణాల చెరువులో రొట్టెను అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే రొట్టెల పండగను రాష్ట్ర పండుగగా ప్రకటించామన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని ఆకాంక్షిస్తూ రొట్టెను పట్టుకున్నట్లు తెలిపారు.
అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘనమైన ఏర్పాట్లు చేశారని కొనియాడారు. అలాగే ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి దర్గాను సందర్శించి ప్రార్ధనల్లో పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి భారతదేశానికి ఏ దేశంతోనూ యుద్ధం రాకూడదంటూ రొట్టెను అందుకోవడం విశేషం. పండగకు హాజరై తప్పిపోయిన 41 మంది చిన్నారులను పోలీసులు వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం తహలీల్ ఫాతెహ చదివింపులు జరగనున్నాయి. శనివారం రొట్టెల పండగ ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
*చిత్రం...స్వర్ణాల చెరువులో రొట్టె పట్టుకుంటున్న ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా