రాష్ట్రీయం

పెట్టుబడుల వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 13: తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావువెల్లడించారు. ఇప్పటికే అనేక ప్రపంచస్థాయి కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాయని, మరిన్ని పరిశ్రమలు, ఐటీ కంపెనీలు ప్రతిపాదనలు అందజేసి ప్రభుత్వంతో చర్చిస్తున్నాయని అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఏరోస్సేస్, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్, ఐటీ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నాయన్నారు. వీటిలో కొన్ని కంపెనీలు టీఎస్-ఐపాస్ ద్వారా అనుమతులు పొంది వచ్చే నెలలో శంకుస్థాపనకు సిద్ధం అవుతున్నాయని కేటీఆర్ తెలిపారు. పరిశ్రమలు, ఐటీ కంపెనీల పురోగతిపై శుక్రవారం సంబంధిత అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి రాబోయే పరిశ్రమలు, ఐటీ కంపెనీల వివరాలను అధికారులు మంత్రికి వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే కంపెనీలకు ప్రభుత్వపరంగా పూర్తి సహకారం అందించాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి పెట్టుబడులు పెరిగితే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా అదేస్థాయిలో పెరుగుతాయన్నారు. టీఎస్ ఐఐసీ ద్వారా చేపట్టిన ఫార్మాసిటీ, జహీరాబాద్ నిమ్జ్, కాకతీయ మెగా టెక్స్‌టెల్ పార్క్, సిరిసిల్లా అపెరల్ పార్క్‌ల పురోగతిని కూడా మంత్రి సమీక్షించారు. వౌలిక సదుపాయాల కల్పన పూర్తయిన పార్క్‌ల్లో కంపెనీలు తమ యూనిట్లు నెలకొల్పడానికి చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆఫ్ ఇండ్రస్టీస్ అధికారులను మంత్రి ఆదేశించారు.
ఐటీ రంగంలో గత ఐదేళ్లుగా అద్భుతమైన ప్రగతి సాధించామన్నారు. అలాగే వచ్చే నాలుగేళ్ల కాలానికి విభాగాల వారీగా చేపట్టాల్సిన కార్యాచరణపై నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. నగరంలో ఒకవైపే ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా ఇతర ప్రాంతాలకు కూడా విస్తరణకు అధికారులు కృషి చేయాలని సూచించారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో మరిన్ని పెట్టుబడలు సాధించే లక్ష్యంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పరిశ్రమలశాఖ కమిషనర్ నదీం అహ్మద్, టీఎస్‌ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ నర్సింహారెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.