రాష్ట్రీయం

పులిచింతల వద్ద పరవళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేళ్లచెర్వు, సెప్టెంబర్ 13: సూర్యాపేటజిల్లా చింతలపాలెం మండల పరిధిలోని పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వస్తున్న వరద నీటితో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శుక్రవారం సాయంత్రం నాటికి 175 అడుగుల పూర్తి నీటి సామర్ధ్యానికి గాను 174.765 అడుగుల మేర నీటి నిల్వ ఉందని, 45.77 టీఎంసీలకు గాను 45.72 టీఎంసీల నీటిని నిల్వ చేసినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. జలాశయానికి ఇన్‌ఫ్లోగా 3,71,561 క్యూసెక్కుల నీరు వస్తుండగా ఔట్‌ఫ్లోగా 3,28,783 క్యూసెక్కుల నీటిని 10 గేట్ల ద్వారా దిగువ భాగాన ఉన్న ప్రకాశం బ్యారేజీకి విడుదల చేస్తున్నారు. భారీగా వరద నీరు రావడంతో ప్రాజెక్టు దిగువ భాగాన ఉన్న వజినేపల్లి, బుగ్గ మాధారం గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. చేపల వేటకు వెళ్లవద్దని జాలర్లను అధికారులు హెచ్చరించారు. కాగా సూర్యాపేటజిల్లా చింతలపాలెం మండల పరధిలోని పులిచింతల ప్రాజెక్టు, తెలంగాణ జెన్‌కో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని శుక్రవారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సందర్శించారు. ఈసందర్భంగా మొదటగా పులిచింతల ప్రాజెక్టు వద్దకు చేరుకుని నీటి ప్రవాహాన్ని, నీటి నిల్వను, గేట్ల ద్వారా విడుదలవుతున్న నీటిని పరిశీలించి అందుకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.