రాష్ట్రీయం

మళ్లీ తెరచుకున్న సాగర్ గేట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, సెప్టెంబర్ 13: శ్రీశైలం డ్యాం నుండి సాగర్‌కు వస్తున్న ఇన్‌ఫ్లో భారీగా పెరగడంతో మరోసారి డ్యాం 26 క్రస్ట్ గేట్లు శుక్రవారం తెరిచారు. గురువారం సాగర్‌కు వస్తున్న నీటి వరద తగ్గిపోవడంతో రాత్రి క్రస్ట్‌గేట్లను పూర్తిగా మూసి వేశారు. శుక్రవారం ఉదయం నుండి వరదనీరు పెరుగుతుండటంతో 6 గేట్ల ద్వారా నీటి విడుదల ప్రారంభమై మద్యాహ్నానికి 26 గేట్లను పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం శ్రీశైలం డ్యాం నుండి 10 గేట్లద్వారా సాగర్‌కు నీరు విడుదలవుతున్నది. సాగర్‌కు 3,49,999 క్యూసెక్కుల నీరు వస్తుండగా ప్రస్తుతం సాగర్ జలాశయంలో 589.80 అడుగుల నీటిమట్టం ఉంది. కుడికాల్వకు 10,633 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 8,829 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్కేంద్రం ద్వారా 33,399 క్యూసెక్కులు, క్రస్ట్‌గేట్లద్వారా 3,75,810 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీకు 2,400 క్యూసెక్కులు, వరదకాల్వకు 300 క్యూసెక్కులు మొత్తంగా 4,29,881 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలానికి 3,04,365 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, జలాశయ నీటి మట్టం 884.50 అడుగులుంది. శ్రీశైలం నుండి భారీ ఇన్‌ఫ్లో వస్తున్న కారణంగా సాగర్ నుండి శ్రీశైలానికి వెళ్లే లాంచీని శనివారం నాడు పూర్తిగా రద్దుచేస్తున్నట్టు తెలిపారు.