రాష్ట్రీయం

కృష్ణా, గోదావరి అనుసంథానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: ఏపీలో నీటిని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకునేందుకు ఆంధ్రా సీఎం జగన్మోహన్‌రెడ్డి తెలంగాణ సహాయ సహకారాలు కోరారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆదివారం నాడు శాసనసభలో చెప్పారు. రెండు రాష్ట్రాల రైతాంగం అభ్యున్నతి కోసం పాత పంచాయితీలను పక్కన పెట్టి కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యామని అన్నారు. ఇరు రాష్ట్రాల ప్రయోజనాల దృష్ట్యా ఏపీతో కలిసి పనిచేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాలకు ప్రయోజనం కలిగించేలా గోదావరి ,కృష్ణా నదులను అనుసంథానం చేస్తామని చెప్పారు. దుమ్ముగూడెం వద్ద బ్యారేజీని ప్రతిపాదిస్తామని, ఇప్పటికే పలు మార్లు ఏపీ సీఎంతోనూ, అధికారులతోనూ , ప్రధాన కార్యదర్శుల స్థాయిలోనూ సమావేశాలు జరిగాయని, మరో మారు ఏపీ ఇంజనీర్లతో సమావేశం అవుతామని పేర్కొన్నారు. దీనివల్ల ఖమ్మం జిల్లాకూ శాశ్వత ప్రయోజనం కలిగించిన వారమవుతామని చెప్పారు. ముంపు సమస్య లేకుండా 35 నుండి 40 టీఎంసీల నీరు నిల్వ చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈ రెండు నదుల అనుసంథానం జరిగితే రెండు రాష్ట్రాలకూ నీటి సమస్య ఉండబోదని అన్నారు. వందల క్యూసెక్కుల గోదావరి నీరు ఊరికే సముద్రంలో కలుస్తోందని , కృష్ణా నదికి ఒక్కోసారి ఎక్కువగా నీరు వస్తోందని, మరోమారు అవసరానికి కూడా సరిపోవడం లేదని, రెండు నదుల అనుసంథానం వల్ల సముద్రంలో కలిసే నీటిని రెండు రాష్ట్రాల రైతాంగం సాగునీటికి, ప్రజల తాగునీటికి వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చిన్నవాడే అయినా కలిసొచ్చారని, ఈ విషయంలో తమకు ఎలాంటి భేషజాలు లేవని సీఎం చెప్పారు.